చరణ్, అర్జున్ కలిసి ఓకే సినిమాలో?

Update: 2017-10-01 10:17 GMT

రామ్ చరణ్, ఆలు అర్జున్ లు ఓకే సినిమాలో కలిసి కనబడతారనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇదేమి పెద్ద సెన్సేషన్ న్యూస్ కానప్పటికీ వారిద్దరూ ఓకే సినిమాలో కనబడతారు ఆటే ఆ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి.ఇదివరకే రామ్ చరణ్ ఎవడు సినిమాలో అల్లు అర్జున్ కొద్దీ నిమిషాల పాటు క్యామియో రోల్ చేసాడు. అయితే ఈ చిత్రంలో చరణ్, అర్జున్ లు ఒకేసారి కనబడలేదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా కోసం చరణ్ క్యామియో రోల్ చెయ్యబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

దేశభక్తి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనబడబోతున్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ నా పేరు సూర్య లో కథను మలుపు తిప్పే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ వినబడుతుంది. రైటర్ వక్కంతం వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నాగ బాబు, లగడపాటి శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి బాబాయ్ నిర్మించే చిత్రం కావడం... బావ అల్లు అర్జున్ హీరోగా నటించే చిత్రం కావడంతోనే చరణ్ ఈ క్యామియో రోల్ కి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

మరి ఆర్మీ ఆఫీసర్ పాత్రకి చరణ్ ఎప్పుడు రెడీ అవుతాడో.. తెలియదు గాని ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం తో బిజీగా వున్నా చరణ్ మరోపక్క తన తండ్రి సై రా సినిమా నిర్మాతగా బాధ్యతలు చేపట్టి ఆ సినిమా పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే

Similar News