ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాంచి ఊపుమీదున్న హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా మెహ్రీన్ కౌర్ పేరు చెప్పేయొచ్చు. తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో మంచి విజయాన్నందుకున్న మెహ్రీన్ కౌర్.... ఇటీవలే మూడు వారాల వ్యవధిలో 'మహానుభావుడు, రాజా ది గ్రేట్' లాంటి సినిమాల్తో వరుసగా సక్సెస్‌లతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. ఆమె నటించిన మరో సినిమా 'కేరాఫ్ సూర్య' ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉండటంతో ఇదీ కూడా పక్కా సక్సెస్ అంటున్నారు.
మరి 'కృష్ణగాడి వీర ప్రేమ గాద, మహానుభావుడు' చిత్రాల్లో కాస్త నీట్ గా పద్దతిగా కనబడిన మెహ్రీన్ కౌర్... 'రాజా ది గ్రేట్' లో మాత్రం సాంగ్స్ లో కాస్త గ్లామర్ షో చేసింది. అయితే ఆ సినిమాలో మెహ్రీన్ కాస్త బొద్దుగా ఉంది.. అందుకే ఆమె గ్లామర్ అంతగా పండలేదన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె నటించిన సాయి ధరం తేజ్ తో కలిసి నటిస్తున్న 'జవాన్' మూవీ లో మాత్రం గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు తనలోని పద్ధతి యాంగిల్ ని చూపించిన మెహ్రీన్ 'జవాన్' తో తన హాట్ నెస్ ని చూపించనుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన 'బుగ్గంచున' అనే సాంగ్ లిరికల్ వీడియో లో ఈ అమ్మడు తన ఫొటోస్ తో ఆ సాంగ్ కె అందాన్ని తీసుకొచ్చింది. జస్ట్ ఆడియో సాంగ్ కె ఇలా ఉంటే ఇక వీడియో సాంగ్ చూస్తే యూత్ కి మరింత కిక్కు ఖాయమనిపిస్తోంది. హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న మెహ్రీన్ మామూలుగానే ఈ సినిమాకు ఆకర్షణ కాగా ఆమె గ్లామరస్‌గా కనిపిస్తుండటం సినిమాకు మరింత కలిసొచ్చే అవకాశముంది. డిసెంబర్ 1 న 'జవాన్' ప్రేక్షకుల ముందుకి రానుంది.