లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీ కి హోమ్లీ హీరోయిన్ గానే ఎంటర్ అయ్యింది. లావణ్య ఇప్పటివరకు నటించిన చిత్రాలలో గ్లామర్ కి అవకాశం లేని పాత్రలనే చేసింది. 'రాధా' సినిమాలో కాస్త గ్లామర్ ఒలకబోసిన ఈ భామ బయట జరిగే అవార్డ్స్ ఫంక్షన్స్ కి గట్రా ఫుల్ గ్లామర్ తోనే హాజరవుతూ తాను ట్రెడిషనల్ అమ్మాయిని కాదని అల్ట్రా మోడరన్ అమ్మాయినే అని రుజువు చేస్తూనే వుంది. మొన్నటికి మొన్న అబుదాబిలో జరిగిన సైమా అవార్డ్స్ లో మత్తెక్కించిన లావణ్య ఇక గ్లామర్ డోస్ పెంచెయ్యడానికి సిద్ధమయ్యింది. అసలు మొన్న మధ్యన అయితే తాను మోడ్రెన్ అమ్మాయిలా సినిమాల్లో నటించడానికే ఇష్టపడతానని... కానీ తనకి అన్ని ట్రెడిషనల్ పాత్రలే వస్తున్నాయని బహిరంగంగానే చెప్పింది.
ఇక ఇప్పుడు టాలీవుడ్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 'యుద్ధం శరణం' సినిమాలో అల్ట్రామోడ్రన్ గా లావణ్య కనిపిస్తుందని ఆ మధ్యన ఎప్పుడో విడుదలైన కొన్ని పిక్స్ లో గమనించాము. ఇక తన అందచందాలతో ప్రేక్షకులను పడెయ్యడానికి లావణ్య రెడీ అయ్యిందని అంటున్నారు. ఇక తమిళంలో కూడా జెండా పాతడానికి రెడీ అయిన లావణ్య.. తెలుగు '100 పెర్సెంట్ లవ్' రీమేక్ లో జీవి ప్రకాష్ కి జోడిగా నటిస్తోంది. ఇక్కడ తెలుగులో తమన్నా చేసిన మహా లక్ష్మి పాత్రని అక్కడ తమిళ్ లో లావణ్య చేస్తుందన్నమాట.
ఇక మనం కూడా అందాలతో రెచ్చిపోయే లావణ్యాన్ని సినిమాల్లో చూసెయ్యొచ్చన్నమాట. పాపం తాను ఇప్పటివరకు నటించిన ట్రెడిషనల్ పాత్రలతో హిట్ కొట్టలేకపోయిన లావణ్య ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేసి హిట్ కొట్టేయాలని బాగా ఫిక్స్ అయ్యిపోయింది.