గరుడవేగా సమస్యలు సమసిపోలేదట!!

Update: 2017-11-15 15:00 GMT

గరుడవేగా సినిమాతో రాజశేఖర్ ఫ్యామిలీ కాస్త ఆర్ధికంగానూ, మరికాస్త కెరీర్ పరంగాను నిలదొక్కుకుంది. సినిమా హాలీవుడ్ రేంజ్ లో హిట్ అయినప్పటికీ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినా గరుడవేగా కి శాటిలైట్ హక్కులు... డబ్బింగ్ రైట్స్ తో బాగానే సంపాదించారు. అయితే ఈసినిమాకి నిర్మాత ఒకరైతే... అంత మేమే అన్నట్టుగా రాజశేఖర్ ఫ్యామిలీ కలరింగ్ ఇచ్చింది. రాజశేఖర్, భార్య జీవిత, కూతుళ్లిద్దరూ ఈసినిమాకొసం చాలా కష్టపడ్డామని అన్ని ఇంటర్వ్యూలో చెబుతూ వస్తున్నారు. అలాగే సినిమాని విడుదల చేయించడానికి తమ ఇల్లు తాకట్టు పెట్టినట్లుగా కూడా వార్తలొచ్చాయి. గరుడవేగా సినిమా విడుదలకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో ఆ చిక్కులు తప్పాయనుకున్నారు.

మధ్యలో వదిలేస్తే....

కానీ గరుడవేగా సమస్యలు సమసిపోలేదట. గరుడావెగాతో జీవిత రాజశేఖర్ చిక్కుల్లో పడిందనే న్యూస్ సోషల్ మీడియా లో హైలెట్ అయ్యింది. గరుడవేగా ని నిర్మాత మధ్యలోనే వదిలేసి వెళితే జీవిత దాన్ని హ్యండోవోర్ చేసుకుని... ఎలాగో తిప్పలుపడి కంప్లీట్ చేసి విడుదల సమయానికి సొంత ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితికి తెచ్చేసిందట. అయితే సినిమా కలెక్షన్స్ సరిగ్గా లేకపోవడంతో గరుడవేగా అప్పులు చాలానే మిగిలేలా కనబడడమే కాకూండా గరుడావెగా హిందీ రైట్స్ విషయంలోనూ జీవితకు చుక్కలు కనబడుతున్నాయట.

ఇద్దరూ అమ్మేశారు...

గరుడవేగా నిర్మాత హిందీ రైట్స్ ని ఒక సంస్థ కు అమ్మగా.. ఆ విషయం తెలియని జీవిత కూడా గరుడావెగా హిందీ రైట్స్ ని మరో వ్యక్తికీ అమ్మేసింది. అయితే అసలు గరుడావెగా హక్కులు జీవిత ఇల్లు తాకట్టు పెట్టిన ఫైనాన్సర్ల దగ్గర వున్నాయట. మరి ఈ విషయమై గరుడవేగా నిర్మాత, జీవిత, ఫైనాన్సర్ లు ముగ్గురు చర్చయించుకుని విషయాన్ని ఒక కొలిక్కి తెస్తే సరేసరి లేకుంటే... ఇంటి పాత్రలతో పాటు.. గరుడవేగా హక్కులు దగ్గర పెట్టుకున్న ఫైనాన్సియర్ రచ్చ చేసేలా ఉన్నాడంటున్నారు.

Similar News