గరుడవేగకి సూపర్ స్టార్ ప్రశంసలు

Update: 2017-11-11 15:00 GMT

రాజశేఖర్ కు పదేళ్ల తరువాత విజయాన్నందించిన చిత్రం 'గరుడవేగ’. ఈ చిత్రం విడుదలైనప్పటినుండే మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్లింది. రాజశేఖర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘పిఎస్వి గరుడవేగ’.

ఈ చిత్రం పై ఇప్పటికే సినీ పరిశ్రమలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. తాజాగా మహేష్ బాబు ఈ చిత్రం పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గొప్ప స్క్రిప్ట్ , మంచి నటనా ప్రదర్శన, స్లిక్ స్క్రీన్ ప్లే తో పిఎస్వి గరుడవేగ అద్భుతంగా ఉంది. చిత్ర బృందం గొప్పగా కృషి చేసింది. హీరో రాజశేఖర్ గారికి , దర్శకుడు ప్రవీణ్ సత్తారు కు అభినందనలు... అంటూ మహేష్ 'గరుడావెగా' చిత్రం పై ప్రశంశలు కురిపించాడు.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుండముతో ఆ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ చిత్రానికి సీక్వెల్ కథ రాయలేదు అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపాడు.

Similar News