గరుడవేగ సినిమా నిర్మాత కనిపించట్లా

Update: 2017-11-11 07:29 GMT

గత వారం రోజులు నుండి టాలీవుడ్ లో 'గరుడ వేగా' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా అద్భుతం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా అయితే పేరు తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ లేకపోవడంతో చిత్ర బృందాన్ని నిరాశ కలిగిస్తుంది. అయినప్పటికీ ఆ నిరాశని బయటికి కనిపించనివ్వకుండా ఉత్సాహంగా సక్సెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు రాజశేఖర్ అండ్ టీం.

చిత్రం రిలీజ్ అయిన దగ్గర నుండి సినిమాను ఏదోఒక రకంగా.. ప్రెస్ మీట్స్, సక్సెస్ సెలెబ్రేషన్స్, సక్సెస్ టూర్స్ అని పెట్టి సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు టీం మెంబెర్స్. అయితే ఈ సినిమా నిర్మాత మాత్రం కోటేశ్వరరాజు ఈ ఈవెంట్స్ లో ఎక్కడా కనపడట్లేదు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాత్రం ఒకసారి అలా వేదిక మీదికి వచ్చి రాజశేఖర్ పక్కన కనిపించాడు. ఆ తర్వాత నుండి ఈవెంట్లో.. సక్సెస్ మీట్లో.. సెలబ్రెటీలకు స్పెషల్ షో వేసిన సందర్భంగా.. ఇలా అన్ని చోట్లా రాజశేఖర్ ఫ్యామిలీ సందడే కనిపించింది కానీ 'గరుడావెగా' నిర్మాత మాత్రం కనబడలేదు.

అయితే చేసిన ప్రతి ఫంక్షన్ లోను రాజశేఖర్, జీవితలే హల్చల్ చేశారు. వీరే నిర్మాతలు అన్నట్టుగా మాట్లాడారు. మరి ఈ సినిమాపై ఏకంగా పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత ఎందుకు లైమ్ లైట్లోకి రావడం లేదన్నది అర్థం కావడం లేదు. ఈ సినిమాను కోటేశ్వరరాజు మధ్యలో వదిలేస్తే.. రాజశేఖర్ ఫ్యామిలీ టేకప్ చేసి పూర్తి చేసిందని.. రిలీజ్ వ్యవహారాలు కూడా వాళ్లే చూసుకున్నారని వార్తలొచ్చాయి. అందుకే నిర్మాత సినిమా నుంచి సైడైపోయారా అన్న చర్చ నడుస్తోంది పరిశ్రమలో. సినిమాకు వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో ఆయన బయటికి రావట్లేదని తెలుస్తుంది.

Similar News