మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' మొత్తం యాక్షన్ ఎంటర్టైనర్ గానే సాగింది. ఆ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కింది. అయితే చిరు మాత్రం ఈ కమర్షియల్ చిత్రాలకన్నా ఒక చారిత్రాత్మక చిత్రంతో అయితే ఇంకా పాపులారిటీ పెరుగుతుందని.. భావించి ఉయ్యాలవాడ జీవిత చరిత్రను 'సై రా నరసింహారెడ్డి'గా తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. ఇక ఉయ్యాలవాడ స్క్రిప్ట్ వర్క్ పనులు ఆలస్యమవడంతో సినిమా ఓపెనింగ్ కూడా ఆలస్యం అయిపోయింది. గత వేసవిలో సినిమా మొదలవుతుంది అనుకుంటే అది కాస్త ఆగష్టు లో పూజ కార్యక్రమాలు జరుపుకుంది.
ఇక ఆగష్టు లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా ప్రారంభమైన 'సై రా నరసింహారెడ్డి' చిత్రం ఇప్పటివరకు సెట్స్ మీదకెళ్ళలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ తోపాటు 'సై రా' లో సినిమాటోగ్రాఫర్ గా సెలెక్ట్ అయిన రవి వర్మన్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో .... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరింత ఆలస్యమైంది. చివరికి 'ఖైదీ...' కి పనిచేసిన రత్నవేలు ని 'సై రా' సినిమాటోగ్రాఫర్ గా సెలెక్ట్ చేసినప్పటికీ రత్నవేలు.... రామ్ చరణ్ 'రంగస్థలం'తో బిజీగా ఉండడం... రామ్ చరణ్ 'రంగస్థలం' షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియకపోవడంతో... 'సై రా' సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కేలా కనబడటం లేదు.
మొన్నటికి మొన్న అక్టోబర్ అన్నారు... కానీ తాజాగా 'సై రా' మొదలయ్యేది మాత్రం వచ్చే జనవరి కే అంటున్నారు. ఇక ఈ సినిమాకోసం మెయిన్ హీరోయిన్ గా నయనతార ని ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు ఆమె ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ కూడా వాయిదా పడ్డాయి. అలాగే 'సై రా' సినిమా కోసం అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ ని తీసుకున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఏ ఆర్ ఎహెమాన్ కొనసాగుతాడా లేదంటే మరెవరన్నా 'సై రా' మ్యూజిక్ పని చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.