మార్చ్ 30 న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ - సుకుమార్ ల కలయికలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం కావడం... చిట్టిబాబు గా చరణ్, రామ లక్ష్మి గా సమంత లుక్స్ తో సినిమా మీద పిచ్చ పిచ్చగా అంచనాలు ఏర్పడినాయి. పక్కా పల్లెటూరి మాస్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. రంగస్థలం లోని చరణ్, సమంత ల ఫొటోస్ మెగా అభిమానులనే కాదు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి కూడా. ఇప్పటికే రంగస్థలం టీజర్స్ తో ప్రమోషన్ కి శ్రీకారం చుట్టిన రంగస్థలం టీమ్ ఇప్పుడు ఇంకాస్త జోరు పెంచుతుంది.
సినిమా విడుదల సమయం దగ్గరపడుతోంది కాబట్టి రంగస్థలం ప్రమోషన్స్ పీక్స్ లోకి తీసుకెళ్లాలని బావిస్తున్నారు. అందుకే రంగస్థలం కి సంబందించిన ఏ ఈవెంట్ అయినా ఆకాశాన్నంటే రీతిలో చెయ్యడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రంగస్థలం ఆడియో లాంచ్ ని గ్రాండ్ లెవల్లో వైజాగ్ లో నిర్వహిస్తామని చెప్పిన రంగస్థలం చిత్ర బృందం ఇప్పుడు ప్రి రిలీజ్ ఈవెంట్ ని కూడా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు ఈవెంట్స్ ని భారీ లెవల్లో నిర్వహించి రంగస్థలం కి అదిరిపోయే క్రేజ్ ని సంపాదించాలని చూస్తున్నారు.
మరి ఈ సినిమా కోసం దేవిశ్రీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి అలాగే ఒక పాటకి ఇచ్చిన మ్యూజిక్ అదిరింది. మరి హాట్ యాంకర్ అనసూయ, తమిళ హీరో ఆది పినిశెట్టి లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది ట్రేడ్ వర్గాల్లో