క్రిష్ అన్నిటిలో సహజత్వాన్ని కోరుకుంటున్నాడు!

Update: 2017-09-15 03:47 GMT

టాలీవుడ్ దర్శకుల్లో విభిన్న మనస్తత్వం వున్న దర్శకుడు క్రిష్. క్రిష్ తెరకెక్కించిన సినిమాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తెరకెక్కినవే. సమాజానికి ఒక మెస్సేజ్ అందించాలనే ఉద్దేశ్యంతోనే క్రిష్ సినిమాలు తీసాడా అనిపిస్తుంటుంది. అయితే మొదటినుండి వైవిధ్య భరిత సినిమాలనే తెరకెక్కిస్తున్న క్రిష్, బాలకృష్ణ తో మాత్రం చారిత్రక నేపధ్యం వున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెరక్కేకించాడు. ఈ చిత్రంలో అనేక యుద్ధసన్నివేశాలను చాలా అందంగా... సహజంగా తెరకెక్కించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. అన్నిటిలో సహజత్వం కోరుకునే ఈ దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ మణికర్ణిక విషయంలో కూడా క్రిష్ తన సహజత్వాన్ని ఫాలో అవుతున్నాడట. ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ మణికర్ణిక చిత్రంలో యుద్ధ సన్నివేశాలు చాలా కీలకం అనే విషయం తెలిసిందే. ఆ యుద్ధ సన్నివేశాలే కథను ముందుకు నడిపిస్తాయి కూడా. దర్శకుడు క్రిష్ వాటిలోనే సహజత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. యుద్దాల్ని సహజంగా ఉండేలా తీయడం కోసం హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రఫర్ నిక్ పావెల్ ను ఆయన 30 మంది టీమ్ ను రంగంలోకి దింపారనే టాక్ వినబడుతుంది.

ఈ మణికర్ణిక కోసం 300 యోధులు, బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ వంటి సినిమాలకు పనిచేసిన నిక్ పావెల్ తన టీమ్ తో కలిసి... ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న కంగనా రనౌత్ తో సహా 300 మంది లోకల్ ఫైటర్స్ కి శిక్షణ ఇచ్చి మరీ యుద్ధ సన్నివేశాలను రూపొందించారట. మరి అలా ఇలా కాకూండా క్రిష్ అన్నిటిని చాల జాగ్రత్తగా తెరకెక్కించనున్నాడన్నమాట. బాలీవుడ్ లో చేస్తున్న ఈ ప్రయత్నంలో క్రిష్ విజయం సాధించాలి అంటే ఈ మాత్రం ప్రయోగాలు చెయ్యాల్సిందే అంటున్నారు.

Similar News