కోలీవుడ్ హీరో పెళ్లి ముచ్చట్లు

Update: 2018-02-11 06:41 GMT

కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హీరో విశాల్. విశాల్ పెళ్లీడు వచ్చినా ఇప్పటివరకు పెళ్లి పేరెత్తకుండా గమ్మునున్నాడు. అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తో ప్రేమాయణం సాగించిన విశాల్ పెళ్లి పేరు మాత్రం ఎత్తేవాడు కాదు. అలాగే పెళ్లి పేరు మీడియా వారు ఎత్తగానే సైలెంట్ గా ఆ పెళ్లి టాపిక్ ని డైవర్ట్ చేసేవాడు. ఈ మధ్యన విశాల్ కి వరలక్ష్మి కి మధ్యన విభేదాలు తలెత్తాయని టాక్ కూడా నడిచింది. అసలు విషయం మాత్రం బయటికి రాలేదుగాని వరలక్ష్మి కి విశాల్ కి మధ్య బ్రేకప్ మాత్రం నిజమంటారు.

పొతే విశాల్ నడిగర్ సంగం ఎన్నికలప్పుడు... నడిగర్ సంగం బిల్డింగ్ కట్టాక అందులో తన పెళ్లి మొదటి పెళ్లి అవుతుందని మాటిచ్చాడు. ఇప్పుడు మాట ప్రకారం విశాల్ నడిగర్ సంగం బిల్డింగ్ పూర్తయ్యాక తన పెళ్లి అని అంటున్నాడు. నడిగర్ సంగం బిల్డింగ్ పనులు పూర్తి కావడమే కాదు.... వచ్చే ఏడాది జనవరిలో నడిగర్ సంగం బిల్డింగ్ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పిన విశాల్ అందులో జరగబోయే మొదటి పెళ్లి తనదే అని.. ఇచ్చిన మాటకి కట్టుబడడమే కాదు... తన పెళ్లి కోసం అప్పుడే నడిగర్ సంగం బిల్డింగ్ కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చానని చెప్పాడు.

కానీ పిల్లెవరూ, ఇప్పటికే పెళ్లి కుదిరిపోతే నే కదా పెళ్లి కోసం అడ్వాన్స్ ఇచ్చేది.... అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ విశాల్ మాత్రం తనకు కాబోయే వధువు వివరాలు బయటపెట్టలేదు. మరి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేవరకు విశాల్ పక్కన ఏ అమ్మాయి పెళ్లి కూతురుగా కూర్చోబోతుందో సస్పెన్స్ అన్నమాట.

Similar News