కోర్టు పద్మావతికి అనుకూలమా? వ్యతిరేకమా?

Update: 2017-11-25 07:00 GMT

సంజయ్ లీల భన్సాలీ అత్యంత వ్యయ ప్రయాసలతో రూపొందించిన పద్మావతి చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావలసి వుంది . అయితే అనేక కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది . ఈ చిత్రంపై రాజపుత్ కర్ణి సేన మండి పడుతుంది . తమ రాణి చరిత్రను వక్రీకరించారని ఆందోళన బాట పట్టారు . దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా స్వరం కలిపింది . దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తో పాటు ప్రధాన పాత్రలో నటించిన దీపికా పదుకొనె ని కూడా వదిలి పెట్టలేదు . వారి ఇద్దరి తలలు తెచ్చి ఇచ్చిన వారికి పది కోట్ల రూపాయలు నజరానా గా ఇస్తామని ప్రకటించారు .

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకూడదని ఢిల్లీ హైకోర్టు లో ఓ పిటిషన్ దాఖలైంది . ఈ పిటిషన్ విచారించకుండనే కోర్టు కొట్టివేసింది. ఇది ఆందోళన చేస్తున్న వారిని ప్రోత్సహించేలా ఉంటుందని అందుకే కొట్టి వేస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది . అయితే ఈ అంశంపై ఎవరైనా సెన్సార్‌ బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ హైకోర్టు సలహా ఇచ్చింది. ఏది ఏమైనా ఇప్పట్లో పద్మావతి వివాదం మాత్రం తెగేలా కనబడం లేదు.

నిన్నటికి నిన్న కోటాలో ఒక యువకుడు శవమై కనబడ్డాడు. అయితే ఆ యువకుడిఫై హత్య లేదా ఆత్మహత్య అనేది మాత్రం తేలాల్సి ఉంది.

Similar News