కొద్దిగా గ్యాప్.... ఆ తర్వాతే వర్మ సినిమా..

Update: 2017-10-19 15:00 GMT

నాగార్జున... నాగ చైతన్య - సమంత పెళ్లి పనులతో.. రాజుగారి గది ప్రమోషన్స్ తో బాగా అలిసిపోయాడు. అందుకే ఇప్పుడు ఒక 10 రోజుల పాటు విరామం తీసుకుని...యూఎస్ వెళ్లి అక్కడ ఈ పదిరోజుల హాలిడేస్ ఎంజాయ్ చేసి రావాలని అనుకుంటున్నాడు నాగ్. ఇప్పటికే రాజుగారి గది ప్రమోషన్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. రాజుగారి గది 2 గత శుక్రవారమే విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా వీక్ గా ఉండడంతో నాగార్జున ఆ సినిమాకి ఎంత ప్రమోషన్ కావాలో అంత చేస్తున్నాడు. తన శాయశక్తులా రాజుగారి గదిని ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందులో భాగంగానే నాగార్జున మాట్లాడుతూ... ఈమధ్య ఎమోషనల్ సినిమాలు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చాలానే చేశా. దీనికి భిన్నంగా ఇప్పుడు ఒక స్టయిలిష్ యాక్షన్ ఫిలిం చేద్దామని అనుకుంటున్నా...... ఇంతలో రామ్ గోపాల్ వర్మ ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ వినిపించాడు. అది నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించా అంటూ చెప్పుకొచ్చాడు. మరి శివ సినిమాతో నాగార్జున చేతికి సైకిల్ చైన్ ఇచ్చి ఇండస్ట్రీ మీదకి వదిలిన వర్మ... మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక యాక్షన్ సినిమానే నాగ్ తో ప్లాన్ చేసాడు. అయితే కొద్దిగా గ్యాప్ అంటే ఓ పదిరోజులపాటు గ్యాప్ తీసుకున్నాక వర్మ సినిమా డిస్కషన్ లో నాగ్ పాల్గొనబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

అయితే రామ్ గోపాల్ వర్మ లక్షిస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించాలి. మరోపక్క నాగార్జున, నాని మల్టీస్టారర్ లో నాగ్ నటించాల్సి ఉంది. మరి నాగార్జున - వర్మ కలయికలో తెరకెక్కే సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.

Similar News