కొత్తగా ట్రై చేస్తున్నారు!!

Update: 2017-08-01 10:00 GMT

ఇప్పుడు బాలీవుడ్ లా ఇక్కడ టాలీవుడ్ లో కూడా కొత్త కొత్త ప్రయోగాలకు వెల్ కమ్ చెబుతున్నారు డైరెక్టర్స్ మరియు హీరోలు. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త కోణంలో ఆలోచిస్తున్నారు. కేవలం హీరోయిజం మీద మాత్రమే సినిమాలు హిట్ అవుతున్నాయనే భ్రమలో ఉన్న వారికి ఇప్పుడు కథ బావుంది అంటే ప్రేక్షకులు ఆ సినిమాని నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే కొత్త ప్రయోగాలకు తెర తీశారు. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వారు విలన్ గా కూడా నటిస్తున్నారు. అసలు హీరోకి నెగెటివ్ ఛాయలుంటే ఒకప్పుడు ప్రేక్షకులు జీర్ణించుకునేవారు కాదు. అలాగే సినిమాలో హీరో చనిపోతాడని తెలిస్తేనే భరించలేని ప్రేక్షకుల అభిరుచులు మారాయి.

కానీ ఇప్పుడు అలా కాదు కథకు అనుగుణంగా పాత్రలను... ఆయా సంఘటనలను నడిపించితే ప్రేక్షకులు వాటికి జైకొడుతున్నారు. బాహుబలి కోసం హీరో రానా విలన్ గా భళ్లాలదేవగా మెప్పించి జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా తేజ డైరెక్షన్ లో రానా నేనే రాజు - నేనే మంత్రి లో కొంచెం నెగటివ్ పాత్రతో కూడా హీరోయిజం చూపించబోతున్నాడు. ఈ విషయం నేనే రాజు - నేనే మంత్రి ట్రైలర్ లోనే అర్ధమయ్యింది. ఇక రానా ఇప్పుడు విభిన్నయిన పాత్రతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు కాబట్టే ఈ సినిమాకి మంచి అంచనాలు ఏర్పడ్డాయని టాక్ ఎప్పటినుండో ఉంది.

అయితే ఇప్పుడు రానా కేవలం నెగెటివ్ టచ్ ఉన్న హీరోయిజమే కాకున్నా.. సినిమా క్లయిమాక్స్ విషయంలోను దర్శకుడు తేజతో కలిసి ఏదో ప్రయోగం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. క్లయిమాక్స్ విషయంలో తేజ, రానా లు ఇద్దరు కొంచెం గట్టి ధైర్యమే చేస్తున్నారని వినికిడి. తేజ ఐడియా ఇవ్వడం... దానిని రానా ఓకే చేయడం... స్క్రిప్ట్ కూడా అలాగే డిమాండ్ చేయడంతో యాంటీ సెంటిమెంట్ తో కూడిన క్లయిమాక్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. అయితే ఏ విషయం తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇక ఈ చిత్రం ఆగష్టు 11 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ క్లయిమాక్స్ ఎలా వుండబోతుందో తెలియాలంటే మరో 10 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Similar News