ప్రభాస్ తాజా చిత్రం సాహో షూటింగ్ స్టార్ట్ చేసుకుని జెట్ స్పీడుతో దూసుకుపోతోందని చెబుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు సాహో సెట్స్ లోకి వెళ్లినట్లు ఆధారాలు లేవు. ఇక సాహో కోసం నటీనటులు అందరూ వచ్చేసారు... కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అసలు ప్రభాస్ కి జోడిగా ఏ హీరోయిన్ ని సెట్ చెయ్యాలో అర్ధం కాక చిత్ర యూనిట్ ఇప్పటివరకు తాత్సారం చేస్తూనే వుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ ని జల్లెడపట్టిన సాహో టీమ్ ఇప్పుడు ఒక కొత్త అమ్మాయిని ప్రభాస్ పక్కన ఫైనల్ చేశారని చెబుతూనే... ఆమె మెయిన్ హీరోయిన్ కోసమో లేకుంటే సెకండ్ హీరోయిన్ కోసమో అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.
కానీ ప్రభాస్ కి జోడిగా ఒక కొత్త అమ్మాయిని తీసుకున్నామనేది పక్కా అంటున్నారు. అనేకమందిని చూసాక ఫైనల్ గా ఈ అమ్మాయిని సాహో కోసం తీసుకొస్తున్నట్టు మాత్రం చెబుతున్నారు. అయితే ఆ అమ్మాయితో ఇంకా చర్చలు జరుపుతున్నారని.... ఫైనల్ కాగానే అగ్రిమెంట్ చేసుకుంటారని తెలుస్తుంది. మరి సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైనప్పటికీ హీరోయిన్ ఎంపిక ఆలస్యం అవడం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతం కొంచెం నెమ్మదిగా జరుగుతుందని హీరోయిన్ ఎంపిక కాగానే మళ్ళీ స్పీడందుకుంటుందని అంటున్నారు.
ఇక ప్రభాస్ సాహో కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యాడు. రీసెంట్ గా ప్రభాస్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లుక్ సాహో కోసమో లేకుంటే ఏదైనా యాడ్ షూట్ కోసమో అనేది మాత్రం క్లారిటీ లేదు.