కొత్త దర్శకుడితో బన్నీ?

Update: 2017-11-05 16:00 GMT

ఇప్పటివరకు అల్లు అర్జున్ సీనియర్ డైరెక్టర్స్ లేదా స్టార్ డైరెక్టర్స్ తోనే ఎక్కువగా పని చేసాడు. అలాంటి బన్నీ కొత్త దర్శకులతో సినిమాలు చేస్తాడని పెద్దగా ఊహించగలేము. ఏదో కెరీర్ స్టార్టింగ్ లో డైరెక్టర్ సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత సినిమాలు మొత్తం స్టార్ డైరెక్టర్స్ తోనే చేసాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు మరో కొత్త దర్శకుడు వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చాడు.

కథ నచ్చితే కొత్త దర్శకులతో చేయటానికైనా ఎప్పుడు సిద్ధం అంటుంటాడు బన్నీ. ప్రస్తుతం 'నా పేరు సూర్య' షూటింగ్ లో బిజీగ వున్న బన్నీ తన నెక్స్ట్ మూవీ కోసం కథలు వింటున్నాడు. అయితే ఇప్పుడు కొత్తకుర్రాళ్ళను దర్శకులుగా అల్లు అర్జున్ అవకాశం ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అలా ముగ్గురు కొత్త కుర్రాళ్లు చెప్పిన కథలు విన్నాడు. వీళ్లలో ఓ కొత్త వ్యక్తి చెప్పిన స్టోరీ లైన్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ నిర్మాతల రిఫరెన్స్ తో ఈ కుర్రాడు బన్నీ కథ చెప్పాడని టాక్. ఈ కథకు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు బన్నీ ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నాడు కూడా. అయితే బన్నీ యూవీ బ్యానర్ లో ఈ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సినిమా చేసే అవకాశం వుంది. ఇదే కనుక నిజమైతే.... వరుసగా 2 సినిమాలతో కొత్త దర్శకులకు బన్నీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.

Similar News