కొడుకు కోసం అలా చేశాడా?

Update: 2017-10-30 01:33 GMT

'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా యూత్ ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన నటనకు యూత్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో విజయ్ కి ఒక్కసారిగా ఫెమ్ వచ్చేసింది. ఒక్క ఫెమ్ మాత్రమే కాకుండా డబ్బు, అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమాని పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు ఆయా భాషల హీరోలు. తమిళంలో అయితే విక్రమ్ తన కొడుకు ధృవ్ ని ఈ 'అర్జున్ రెడ్డి' సినిమాతోనే కోలీవడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు. అయితే తన కొడుకు ధృవ్ కూడా విజయ్ లాగా పర్ఫెక్ట్ గా ఈ సినిమాలో నటించాలి అంటే.. 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ సలహాలు సూచనలు పాటిస్తే ధృవ్ కూడా పర్ఫెక్ట్ గా ఈ సినిమాలో చేయగలడని హీరో విక్రమ్ భావించి ఒక్కరోజు తన కొడుకు ధృవ్ తో గడపాలని విజయ్ ని విక్రమ్ కోరడమే ఆలస్యం... విక్రమ్ వంటి స్టార్ హీరో పిలవగానే విజయ్ దేవరకొండ అటు చెన్నైలో వాలిపోయాడంటున్నారు.

బాల దర్శకత్వంలో విజయ్ తన కొడుకుని ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు విక్రమ్. ఇక ధృవ్ తో ఒక్కరోజు గడిపేందుకు విజయ్ అంగీకరించడంతోపాటే తనకి 'అర్జున్ రెడ్డి' తో వచ్చిన అనుభవాలను ధృవ్ తోపాటు దర్శకుడు బాలతో కూడా పంచుకున్నాడట విజయ్. అలాగే కొన్ని సలహాలు సూచనలు కూడా ధృవ్ కి అందజేశాడట విజయ్. ఇక 'అర్జున్ రెడ్డి' లో విజయ్ నటనను దర్శకుడు బాలా అభినందించినట్టుగా కూడా చెబుతున్నారు. మరి 'అర్జున్ రెడ్డి' సినిమాతో పది కాలాలు గుర్తుండిపోయే కేరెక్టర్ లో చేసిన విజయ్ దేవరకొండను విక్రమ్ కూడా ప్రత్యేకంగా అభినందించినట్టుగా తెలుస్తుంది. ఇక విజయ్ ఇచ్చిన సలహా సూచనలు విక్రమ్ కొడుకు ధృవ్ ని ఎలాంటి స్టార్ ని చేస్తాయో చూద్దాం.

Similar News