కొంచెం కష్టమే కదూ!!

Update: 2017-07-08 09:00 GMT

నాగ చైతన్యతో లవ్ వ్యవహారం తెర మీదకొచ్చాక "సమంత కి సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. కేవలం తమిళ్ లో మాత్రమే బిజీగా వున్న సమంతకి ఇక్కడ తెలుగులో మాత్రం కావాల్సినంత ఖాళీ దొరికింది". కారణం అక్కినేని ఫ్యామిలీ అని ప్రచారం కూడా జరిగింది. కానీ నాగ చైతన్య తో ప్రేమలో మునిగి తేలుతున్న సమంతకి ఎప్పుడైతే చైతుతో ఎంగేజ్మెంట్ జరిగిందో... అదిగో అప్పటినుండి సినిమా అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చేతినిండా తెలుగు, తమిళ సినిమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.

ఇక పెళ్లి కూడా అక్టోబర్ 6 న జరగనుందని నాగ చైతన్య రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికోసం సమంత, నాగ చైతన్యలు సినిమా షూటింగ్స్ నుండి మూడు నెలలపాటు లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారు. మరి నాగ చైతన్య అంటే చేస్తున్న సినిమాలు స్పీడుగా కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధమవుతూన్నాడు. మరో సినిమా మొదలు పెట్టినప్పటికీ అది చైతు పెళ్లి బ్రేక్ తర్వాతే సెట్స్ మీదకి వెళ్లేట్టు ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ చిక్కల్లా సమంతకే. సమంత నటిస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఉన్నాయి.

రామ్ చరణ్ తో చేస్తున్న 'రంగస్థలం' సంక్రాంతికి విడుదల అంటే షూటింగ్ సగం కంప్లీట్ అయ్యిందానికిందే లెక్క. అంటే సమంత తో చెయ్యాల్సిన సీన్స్ బోలెడు పెండింగ్ లోనే ఉండి ఉంటాయి. అలాగే 'మహానటి' షూటింగ్ కూడా ఈ మద్యనే మొదలెట్టుకుని సెట్స్ మీదకెళ్లింది. అలాగే తమిళ సినిమాల షూటింగ్స్ కూడా మధ్యలోనే ఉండడంతో సమంత తన పెళ్లి, హనీమూన్ ప్లాన్స్ ని ఏ విధంగా సినిమా షూటింగ్స్ కి ఇబ్బందులు కలగకుండా చేసుకుంటుందనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే సమంత తన వర్క్ లో ఎంతో సిన్సియర్ కాబట్టి ప్రొఫెషనల్ గా ఏ ఇబ్బందులు తలెత్తకుండానే ఎంతో జాగ్రత్తగా పెళ్లి, హనీమూన్ ట్రిప్స్ ని ప్లాన్ చేసుకోగలదని అంటున్నారు.

Similar News