కైరా అద్వానీ అదరగొట్టింది!

Update: 2017-11-25 08:00 GMT

మహేష్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే మహేష్ సినిమా షూటింగ్ లో జోరుగా పాల్గొంటున్న ఈ భామ అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఫోటో గ్రాఫర్స్ కెమెరాలకు చిక్కుతూనే వుంది. అయితే ఇప్పుడు తాజాగా కైరా అద్వానీ ఫోటో షూట్ ఒకటి సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటో షూట్ అలాంటి ఇలాంటి ఫోటో షూట్ కాదు హాట్ హాట్ ఫోటో షూట్. అమ్మడు అందాల ఆరబోత చూస్తే నోటి మాట పడిపోతుంది అనేలా వుంది.

అయితే కేవలం అవకాశాల కోసమే ఇలా హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది జగమెరిగిన సత్య. తమకు అవకాశాలు దండిగా రావాలంటే ఇలాంటి ఫోటో షూట్స్ కంపల్సరీ అనే భావంలో ఈ తరం హీరోయిన్స్ కొట్టుకుపోతున్నారు. ధోనీ చిత్రంలో.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జోడీగా ధోనీ భార్య సాక్షి పాత్రలో నటించిన కైరా అద్వానీకి ఆ తర్వాత మెషీన్ అనే హిందీమూవీలో లీడ్ రోల్ చేసినా కానీ హిట్ కొట్టలేకపోయింది. అక్కడ బాలీవుడ్ లో హిట్ లేకపోతె ఏంటి ఇక్క టాలీవుడ్ లో కొరటాల తన సినిమాలో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ పక్కన అవకాశం ఇచ్చాడు.

అయితే ఇప్పుడు తాజాగా కైరా అద్వానీ ఎఫ్ హెచ్ఎం ఇండియా మేగజైన్ కవర్ పేజ్ కోసం చేసిన ఫోటో షూట్ హీటెక్కిస్తోంది. ఇక ఆ మ్యాగజైన్ వాళ్ళు సెక్సీ అండ్ స్ట్రాంగ్ అంటూ డిస్క్రిప్షన్ ఇచ్చి మరీ... ది ఫ్రంట్ రన్నర్ అంటూ ట్యాగ్ లైన్ తగిలించి కైరా ఫోటోలను ప్రచురించింది. మరి ఆ ఫొటోస్ చూస్తే మాత్రం అబ్బా.. మహేష్ హీరోయిన్ ఇరగదీసింది అంటారు. మరి ఆ ఫోటోని మీరు ఓ లుక్కెయ్యండి.

Similar News