కేట్ కత్తిలాంటి ఫిగర్

Update: 2017-11-25 11:04 GMT

సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా కనబడుతుంది కత్రినా కైఫ్. వరుస ప్లాప్స్ తోపాటు రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయినా కూడా కత్రినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెంటపడింది. మరోపక్క టాప్ సినిమాల్లో దీపికా చక్రం తిప్పుతుంది. మరోపక్క కరీనా పెళ్లి చేసుకున్నాక కాస్త అవకాశాలు తగ్గాయ్. అలాగే ఐశ్వర్య రాయ్ కూడా ఓ.. అన్నంత ఫామ్ లో లేదు. మిగతా హీరోయిన్స్ సరే సరి. అందుకే ఈ మధ్యన హీరోయిన్ గా కత్రినా కైఫ్ కొన్ని సినిమాల్లో చక్రం తిప్పుతుంది.

కత్రినా పాత ప్రియుడు సల్మాన్ తో టైగర్ జిందా హై లో నటిస్తూ నా అందాలు చూపించడానికి హద్దేలేదని చెప్పేస్తుంది. సల్మాన్ ఇచ్చిన ఈఅవకాశాన్ని మాత్రం కత్రినా పూర్తిగా ఉపయోగించుకుంది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న వేళ టైగర్ జిందా హై ప్రమోషన్స్ పీక్స్ కి చేరాయి. ఇక టైగర్ జిందా హై సాంగ్ లో సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీ అదిరిపోయే లెవల్లో ఉంది. అలాగే కత్రినా అందాలు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ.. కైపెక్కిస్తుంది. తాజాగా కత్రినా పోస్ట్ చేసిన ఒక పిక్ ని చూస్తుంటే మాత్రం అబ్బా.. కత్రినా కైఫ్ నిజంగా కత్తిలా ఉందనుకునేలా ఉంది. ఈ పిక్ లో కత్రినా వైట్ టాప్ ధరించి.. టోర్నడ్ డెనిమ్ జీన్స్ షార్ట్ వేసుకుని.. ఓ పాతకాలపు తలుపు ముందు నుంచుని కైపెక్కిస్తుంది. మరి కత్రినా అందాలు పూర్తిగా ఆస్వాదించాలంటే.... సినిమా విడుదలవరకు ఓపిక పట్టాల్సిందే.

Similar News