కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రేమ వ్యవహారమా..?

Update: 2017-07-04 10:00 GMT

'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటించిన మంజిమ మోహన్ మీద ఇప్పుడు కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ ఒక వార్త హల్చల్ చేస్తుంది. 'సాహసం...' చిత్రంలో చాలా పద్దతిగల అమ్మాయిగా నటించిన మంజిమాకు ఆ సినిమ మంచి ఫలితం ఇవ్వలేకపోయింది. ఇక కోలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇప్పుడు కోలీవుడ్ లో తాజాగా ఉదయనిథి స్టాలిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో గ్లామర్ రోల్ పోషిస్తుంది. మరి కోలీవుడ్ లో ఇంకా పూర్తిగా బిజీ కానీ మంజిమ మీద ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది.

కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా అదరగొడుతున్న అనిరుద్ రవిచందర్ తమ్ముడు రిషికేష్ తో మంజిమ మోహన్ ప్రేమ వ్యవహారం నడుపుతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. రిషికేష్ తో కలిసి మంజిమ ఈవెనింగ్ పార్టీలకు, పబ్ లకు తిరుగుతుందని అంటున్నారు. కోలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడే రిషికేష్ తో మంజిమాకు స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారిందనే టాక్ వినబడుతుంది. అయితే రిషికేష్ కూడా ఒక నటుడే. తమిళంలో ఘన విజయం సాధించిన 'విఐపి' చిత్రంలో ధనుష్ కి తమ్ముడిగా నటించాడు. ఇప్ప్పుడు సోలోగా రెండు సినిమాలు చేస్తున్న రిషికేష్ కూడా నటనకు కొత్తే. మరి కెరీర్ ఆరంభంలోనే మంజిమ, రిషికేష్ లు ప్రేమలో పడ్డారన్నమాట.

Similar News