టాలీవుడ్ లో కృష్ణవంశీ గడ్డు కాలం మొదలైనట్లేనా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ మధ్యన వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృష్ణవంశీ కి కష్టకాలం మాత్రం వెన్నంటే ఉంటుంది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం యావరేజ్ గా ఆడడంతో ఈ క్రియేటివ్ డైరెక్టర్ కి చేతిలో ఆఫర్స్ లేకుండా పోయాయి. ఇక రామ్ చరణ్ చిత్రం తర్వాత సందీప్ కిషన్, రెజీనా జంటగా నక్షత్రం సినిమాని తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. అయితే ఈ చిత్రం ఇప్పుడు విడుడల కష్టాలను ఎదుర్కొంటుంది. దానితో కృష్ణ వంశీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే తయారైంది.
అయితే తాజాగా కృష్ణ వంశీ మీద కొరియోగ్రాఫర్ రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనని ఒక సినిమాకి కొన్ని రోజులు పని చేయించుకుని తనకి డబ్బులు ఇవ్వకపోగా తనని చాలా అవమానించాడని లేటేస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అసలు కృష్ణ వంశీ ని రాకేష్ మాస్టర్ బండబూతులు తిట్టాడు. కృష్ణ వంశీ ఒక వెధవ అని అతనికి ఇద్దరు వెధవలు సపోర్ట్ అని ఎద్దేవా చేసాడు. జోగి బ్రదర్స్ మీద చేతులు వేసుకుని ఫోజ్ కొడుతూ అందరి మీద పెత్తనం చెయ్యడమే కృష్ణవంశీకి తెలుసనీ చెడామడా తిడుతున్నాడు. ఆయనేమన్నా దేవుడా అయన సినిమా హిట్టయ్యింది అంటే అది ఒక్క కృష్ణ వంశీ గొప్పదనం కాదు 24 క్రాఫ్టులు కలిస్తేనే సినిమా హిట్టవుతుందని చెబుతున్నాడు.
తనని ఒక సినిమాకి 11 రోజులు కొరియోగ్రఫీ చేయించుకుని కనీసం బెటాలు గాని డబ్బుగాని ఇవ్వలేదని... తన పేరు కూడా సినిమా టైటిల్స్ లో వెయ్యలేదని చెబుతున్నాడు. ఇక ఇవన్నీ చెప్పడానికి కారణం కృష్ణ వంశీ తనని అవమానించడమేగాని అతనిపై ఎలాంటి శత్రుత్వం లేదని అంటున్నాడు. మరి ఆ డాన్స్ మాస్టర్ కి ఎంతగా కడుపు మండకపోతే ఇలా కృష్ణవంశీని పిచ్చ తిట్లు తిడతాడు. ఏది ఏమైనా ఈ విషయంతో కృష్ణ వంశీ పరువుకు డ్యామేజీ ఏర్పడినట్లే అంటున్నారు.