కుమ్ములాట ఎక్కువైంది

Update: 2017-08-24 12:31 GMT

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం మరికొద్ది సేపట్లోనే థియేటర్స్ లోకి రాబోతుంది. సినిమా విడుదలయ్యేది రేపు శుక్రవారం ఆగష్టు 25 నే అయినప్పటికీ ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ అంటూ చిత్ర యూనిట్ హడావిడి చేస్తుంది. అయితే ఈ సినిమా విడుదలకు టైం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై వివాదాలు రాజుకోవడమే కాదు అవి భగ్గుమనే స్టేజ్ కి వచ్చేసాయి. ఆ సినిమాలో ఉన్న బూతు పదాలు, ముద్దు సీన్స్ తో నెగెటివ్ పబ్లిసిటీ తో జనాల్లోకి దూసుకుపోయింది ఈ చిత్రం. అయితే ఇప్పుడు ఆ లిప్ లాక్ కిస్సుల మీద పెద్ద రణరంగమే జరుగుతుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆ 'అర్జున్ రెడ్డి' లిప్ లాక్ పోస్టర్స్ ని చింపెయ్యడంతో స్టార్ట్ అయ్యింది ఈ గోల. మహిళా సంఘాల వాళ్ళు కూడా 'అరుణ్ రెడ్డి' పోస్టర్స్ మీద రచ్చ చెయ్యడం, దానికి 'అర్జున్ రెడ్డి' టీమ్ సారీ చెప్పి పోస్టర్స్ అన్ని పీకిపారేయ్యడం జరిగిపోయింది. అయినా ఈసినిమాపై రచ్చ ముగియలేదు. మళ్ళీ వీహెచ్ మీద కయ్యానికి కాలు దువ్వాడు డైరెక్టర్ వర్మ. రామ్ గోపాల్ వర్మ విజయ్ ని సపోర్ట్ చేస్తూ వీహెచ్ మీద వీరంగం చేస్తున్నాడు. సై అంటే సై అంటూ వీహెచ్, రామ్ గోపాల్ వర్మలు కయ్యానికి కాలు దువ్వుతూ సినిమా పై గంట గంట కి ఆసక్తి రేకెత్తించేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ కి వీహెచ్ కూడా కౌంటర్లు బాగానే వేస్తున్నాడు.

రామ్ గోపాల్ వర్మని హైదరాబాద్ లో కాలు ఎలా పెడతావో చూస్తా అంటూ వీహెచ్ కౌంటర్ వేయగా.. దానికి వర్మ నేను హైదరాబాద్ లో ఉన్న రా చూసుకుందాం అంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు. మరి సినిమాపై ఇంత నెగెటివ్ పబ్లిసిటీ అయితే వచ్చేసింది. కానీ సినిమా ఫలితం తేడా కొడితే గనక విజయ్ దేవరకొండకి పగిలిపోయే కౌంటర్లు పడతాయని అంటున్నారు కొంతమంది.

Similar News