కాస్మెటిక్ సర్జరీ పుకార్లని ఖండించిన బాలీవుడ్ బ్యూటీ

Update: 2018-01-20 13:00 GMT

మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ హిందీ సినిమాలలో వరుస విజయాలతో, కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక నిర్మాతలని వెయిటింగ్ లో పెట్టె స్థాయికి వెళ్లి అప్పటికి టాప్ పోసిషన్ రేస్ లో ఉన్న భామలందరికి గట్టి పోటీ ఇచ్చింది. అయితే కొద్ది కాలం గా అమ్మడి హవా బాలీవుడ్ లో తగ్గిపోయింది. ఇదివరకటిలా అవకాశాలంటూ నిర్మాతల ఫోన్ ల ఒత్తిడి లేదు. వచ్చే అరుదైన అవకాశాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయాయి. దానితో కొంత కాలం చాలా తీవ్ర పరిణామాలని ఎదుర్కొంది కత్రినా.

గత ఏడాది జగ్గా జాసూస్ తో బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నించినా ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది. ఏడాది చివరిలో వచ్చిన టైగర్ జిందా హై లో తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో జతకట్టి యాక్షన్ ఎపిసోడ్స్ లో విజృంభించిన కత్రినా కి ఆ చిత్రం బౌన్స్ బ్యాక్ చిత్రం ఐయింది. అయితే అంతకు ముందు కంటే కత్రినా ముఖంలో చాలా మార్పులు వచ్చాయని గమనించిన టైగర్ జిందా హై చూసిన ప్రేక్షకులు కత్రినా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుందని అనుకోవటం, ఈ ఊహలకి బలాన్ని ఇస్తూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవ కథనాలు ఊపందుకోవటంతో వీటిని ఖండిస్తూ తాను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీ లు చేపించుకోలేదని స్వయంగా కత్రినా కైఫ్ వివరణ ఇచ్చుకుంది. చాలా కాలం తరువాత వచ్చిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న తనకి ఈ పుకార్లు తల నొప్పి గా మారటంతో తానే నోరు విప్పక తప్పలేదు కత్రినా కి.

Similar News