కాస్త ఆలోచించండయ్యా

Update: 2018-02-15 07:17 GMT

ఇదివరకు సినిమా చూసి సాయంత్రానికి సినిమా విశ్లేషకులు సినిమా రివ్యూ లు రాసేవారు. అలాగే కొన్నాళ్ల క్రితం వరకు అయితే సినిమా విడుదలైన మొదటి షో కె రివ్యూస్ పలు వెబ్సైట్ లో దర్శనమిస్తున్నాయి. కానీ ఈమధ్య కాలంలో సినిమా విడుదవులయ్యే ఒకరోజు ముందే యుఎస్ లో ప్రీమియర్స్ షోస్ పడడంతో ఇక్కడ తెలుగులో సినిమా విడుదలకు ముందే కొన్ని వెబ్సైట్ లో మూవీ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. ఈ రివ్యూస్ వలన కొన్ని సినిమా నిర్మాతలు నష్టపోతున్నారు. ఎందుకంటే బడా సినిమాల రివ్యూలు చూసి కొంతమంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. సినిమాకి యావరేజ్ రేటింగ్ వచ్చిన సినిమాలు చూద్దడానికి కొంతమంది ఇష్టపడడం లేదు. ఈ రివ్యూ రైటర్స్ మీద ఎప్పటినుండో చాలామంది హీరోలు గుస్సాతోనే ఉన్నారు. కానీ మీడియా వాళ్ళని కెలికితే ఎలాంటి ప్రోబ్లెంస్ వస్తాయో అని తగ్గుతున్నారు. కొంతమంది బహిరంగంగానే రివ్యూ రైటర్స్ ని ఏకిపడేస్తున్నారు. వారిలో అల్లు అర్జున్, మోహన్ బాబు వంటి వాళ్ళు ఉన్నారు.

అయితే ఇప్పుడు మరో నిర్మాత కూడా ఈ రివ్యూ రైటర్స్ కి ఒక సూచన చేసాడు. ఆయనెవరో కాదు బాహుబలితో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన శోభు యార్లగడ్డ. ఆయన నాని నిర్మాతగా పలువురు టాలీవుడ్ స్టార్స్ నటించిన అ! సినిమా రేపు శుక్రవారమే విడుదలవుతుంది. ఆ సినిమా సక్సెస్ సాధించాలని అ! చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేసాడు. తెలుగు సినీ చరిత్రలోనే అ! లాంటి సినిమా తెరకెక్కడం అనేది అరుదైన ప్రయత్నమని కితాబిచ్చారు. ఫిలిం క్రిటిక్ లు ఈ సినిమాను పూర్తిగా చూసి, అర్థం చేసుకుని రివ్యూలు రాయాలని... ఇది తన సిన్సియర్ రిక్వెస్ట్ అని కోరారు.

మరి ఒక కాన్సెప్ట్ కోసం ఇంత పెద్ద టాలీవుడ్ స్టార్స్ అంతా ఒక్కటయ్యారంటే తనకు నమ్మశక్యంగా లేదని చెప్పారు. మరి అ! సినిమా కాన్సెప్ట్ మొత్తం కొత్తగా ఉంటుదనేది అ! ట్రైలర్ లో అర్ధమయ్యింది. మరి నిజంగానే శోభు యార్లగడ్డ చెప్పినట్టుగా సినిమా మొత్తం చూసి దాన్ని పూర్తిగా అర్ధం చేరేసుకున్నాకే క్రిటిక్స్ తమ రివ్యూ లు ఇస్తే బావుంటుంది. ఇక రేపు శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో రవితేజ, నాని, రెజీనా, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, మురళి శర్మ లాంటి స్టార్స్ నటించారు.

Similar News