రామ్ చరణ్.. సుకుమార్ రంగస్థలం చిత్రంలో దివ్యంగుడిగా కొత్తగా ట్రై చేస్తున్నాడు. చిట్టిబాబుగా పక్కా పల్లెటూరి యువకుడిగా గెడ్డం పెంచేసి అదిరిపోయే గెటప్ లోకి మారిపోయిన రామ్ చరణ్ తాజాగా బోయపాటి శ్రీను సినిమా కోసం యాక్షన్ లోకి దిగిపోతున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ఫుల్ యాక్షన్ కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. పక్కా మాస్ మసాలాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్, మరో హీరోయిన్ స్నేహ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా.... బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది.
అయితే ఈ చిత్రంలో చరణ్ అన్నగా ఒకసారి నవీన్ చంద్ర నటిస్తున్నాడని,... తాజాగా ఆర్యన్ రాజేష్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. కానీ పక్కాగా క్లారిటీ లేదు. ఇకపోతే బోయపాటి - చరణ్ సినిమాలో విలన్ కేరెక్టర్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కి నిర్మాత దాదాపుగా అక్షరాల మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ కాస్ట్లీ విలన్ వివేక్ ఒబెరాయ్ కి రామ్ చరణ్ కి రెండో షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసాడట దర్శకుడు బోయపాటి