కాలా తో కలకలం సృష్టిస్తున్నాడుగా

Update: 2018-03-19 07:45 GMT

రజినీకాంత్ కి సౌత్ లో ఎంతగా క్రేజ్ ఉందొ వేరే చెప్పక్కర్లేదు. రజినీకాంత్ సినిమాలు వస్తున్నాయి అంటే సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. సూపర్ స్టార్ రజినీకాంత్ కి హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది. అందుకే రంజిత్ పా తో తీసిన కబాలి సినిమా అట్టర్ ప్లాప్ అయినా.. మళ్ళీ రంజిత్ పా తో కలిసి ధనుష్ నిర్మాణంలో చేసిన కాలా సినిమాపై విపరీతమైన క్రేజ్ ట్రేడ్ వర్గాల్లోనూ.. ప్రేక్షకుల్లోనూ ఉంది. ప్రస్తుతం కాలా కి సంబందించిన బిజినెస్ ఒక లెవల్లో జరుగుతుందని అంటున్నారు.

ఇప్పటికే కోలీవుడ్ మీడియాలో కాలా శాటిలైట్ రైట్స్ ని స్టార్ గ్రూప్ వారు తెలుగు, తమిళ్, హింది మూడు బాషలకు కలిపి హోల్ సేల్ గా 75 కోట్లకు కొనేసిందనే న్యూస్ ప్రకంపనలు రేపుతోంది. మరి ధనుష్ ఈ సినిమాకి భారీగా బడ్జెట్ కూడా పెట్టలేదు.అంటే 150 కోట్ల బడ్జెట్ అయ్యిందో కూడా తెలియదు. మాములుగా రజిని పారితోషకాన్ని పక్కనపెడితే గనక మిగతా బడ్జెట్ మాత్రం 100 కోట్లకు మించదు. అలాంటిది ఈ రేంజ్లో శాటిలైట్ హక్కులకు ధర పలికింది అంటే రజిని అల్లుడు కి పంట పండినట్లే. ఈ కాలా సినిమా తో ధనుష్ మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే.

మరి ఈ నెల 27 న విడుదలకు సిద్దమవుతున్న కాలా సినిమాకి ఇంకా సెన్సార్ జరగాల్సి ఉంది. మరి రంజిత్ పా - రజినీకాంత్ ల కలయికలో వచ్చిన కబాలి సినిమా మ్యాజిక్ చేయలేకపోయినా... ఇపుడు కాలా మాత్రం మ్యాజిక్ చేసి హిట్ కొడుతుందని నమ్మకంగా కాలా దర్శకనిర్మాతలు ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల ఏప్రిల్ 27 అంటున్నారు. ప్రస్తుతం తమిళనాట థియేటర్స్ బంద్ నిరవధికంగా సాగుతూ థియేటర్స్ మూతపడ్డాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ యాజమాన్యాలు బంద్ విరమించినా తమిళనాట మాత్రం ఇంకా బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. మరి కాలా టైం కి అన్ని సర్దుకుని థియేటర్స్ బంద్ ముగుస్తుందని అనుకుంటున్నారు అంతా.

Similar News