కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ స్వీట్ సిస్టర్స్ అనే విషయం తెలిసిందే. కాకపోతే కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయితే.. నిషా అగర్వాల్ యావరేజ్ హీరోయిన్ గా కూడా నిలబడలేక పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కాజల్ కెరీర్ లో బిజీగా ఉండడంతో తన కన్నా చిన్నదయిన నిషా అగర్వాల్ ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ ని పెళ్ళాడేసింది. కానీ కాజల్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండి పోయింది. ఇప్పుడు ప్రస్తుతం కాజల్ పెళ్ళికి రెడీ అంటుంది కానీ... అది ఇప్పట్లో జరిగే పని కాదు.
అయితే నిషా అగర్వాల్ ముంబయి బిజినెస్ మ్యాన్ ని ప్రేమ పెళ్లి చేసుకుని ఇపుడు తాజాగా ఒక బిడ్డకి తల్లయింది. ఇక తన చెల్లి ఒక మగ బిడ్డకు తల్లయిందనే స్వీటెస్ట్ మూమెంట్ ని కాజల్ ట్వీట్ ద్వారా అభిమానులతో పంచుకోవడమే కాదు... చెల్లి నిషా అగర్వాల్ బిడ్డని చేత్తుల్లోకెత్తుకుని ముద్దు పెడుతున్న ఆ స్వీటెస్ట్ మూమెంట్ ని పోస్ట్ చేసింది. ఇక నిషా అగర్వాల్ కి పుట్టిన ఆ బిడ్డ పేరును కూడా కాజల్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకుంది. ఆ బిడ్డ పేరు ఇషాన్ వలెచ్చ గా పెట్టినట్లుగా ట్వీట్ చేసింది. మరి ఇంత హ్యాప్పీస్ట్ మూమెంట్ కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటుందన్నమాట.