కళ్యాణ్ రామ్ కొత్త పార్టీ .. దాని సింబల్ ఏంటో తెలుసా

Update: 2017-11-04 09:58 GMT

తమ్ముడుతో తీసిన సినిమా 'జై లవకుశ' కి అంత మంచ్చి రెస్పాన్స్ రాకపోయినా దానిని మనసులో పెట్టుకోకుండా కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ పై ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. కళ్యాణ్ రామ్ కొత్త పార్టీ పెడుతున్నాడని. ఈ పార్టీ సింబల్ ట్యాప్ గుర్తు అని... 2019 ఎలక్షన్ లో ట్యాప్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నాడట.

ఏంటి ఇదంతా రియల్ అనుకుంటున్నారా కాదండి ఇది రీల్ లైఫ్. అవును కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ మూవీ ఉపేంద్ర అని కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాడు. 'ఎమ్యెల్యే'(మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్.... ఈ సినిమాలో కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా సంబంధించి ఓ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. వీరభద్రాపురం ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నది ఈ పోస్టర్ సారాంశం.

సోషల్ మీడియా వైరల్ అయిన ఈ పోస్టర్ కి టాలీవుడ్ మొత్తం నిజమేనేమో అనుకుంటున్నారు. ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో క‌ళ్యాణ్‌రామ్ న్యూలుక్‌లో క‌నిపించ‌నున్నాడు.

Similar News