కళ్యాణ్ ని స్పందించమనటం అవివేకం

Update: 2018-01-23 03:15 GMT

దాదాపు మూడు నెలల పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం తోపాటు వాగ్వివాదాలు, వ్యక్తిగత దూషణలు పరస్పరం అనేకం చోటు చేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఇరువర్గాల వారు కొంత రాజీ కి వచ్చి ఘర్షణని సర్దుమణిగేలా చేసుకోవటంతో పరిస్థితి శాంతపడింది. కానీ ఈ తతంగాన్ని ఇంకా సోషల్ మీడియా మర్చిపోలేదు. ఇప్పటికి కూడా పలు సామాజిక మాంద్యమాలలో కత్తి మహేష్ పై వ్యంగ్య హాస్యం చేస్తూ వస్తున్న ఫోటోలు అనేకం ప్రచారంలో ఉంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఆఫీస్ కానీ ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలుపలేదు. కానీ పదే పదే పవన్ కళ్యాణ్ తనకి జరిగిన వ్యక్తిగత నష్టానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ తెలుపాలని కత్తి మహేష్ కోరటం జరిగింది.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కత్తి మహేష్ కి సంబంధించిన ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ రామ్ గోపాల్ వర్మ, "విదేశీ పర్యాటకుడి పై భారత దేశంలో ఎవరో ఒకరు చేసిన దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని క్షమాపణ తెలుపమనటం అవివేకం అయితే కోట్ల సంఖ్యలో అభిమానులని కలిగి ఉన్న కళ్యాణ్ వారిలో కొందరు చేసిన పనికి ఎలా బాధ్యత వహిస్తారు? అసలు కళ్యాణ్ ప్రమేయం లేకుండా జరిగినదానికి ఆయనని స్పందించి, బాధ్యత వహించి క్షమాపణ తెలుపమనటం చాలా అవివేకం." అని అన్నారు ఆర్.జి.వి.

Similar News