సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాతలు. మరి సంక్రాంతికి పవన్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం కూడా రావడంతో సిట్యువేషన్ మొత్తం మారిపోయింది. అంతేకాదు మహేష్, కొరటాల కలయికలో లో వస్తున్న 'భరత్ అను నేను' చిత్రం కూడా సంక్రాంతి బరిలో వుంటుందని గట్టిగా వినిపించేసరికి రామ్ చరణ్ తన 'రంగస్థలం 1985'ని వేసవికి వాయిదా వేసుకున్నాడని వార్తలు సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి
అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ అధికారికంగా తమ సినిమా వస్తుందని ప్రకటించారు కాబట్టి మహేష్ తన చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మహేష్ చిత్రం గనక అధికారికంగా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే.... 'రంగస్థలం' చిత్రాన్ని పవన్ సినిమాకి ఒక నాలుగైదు రోజుల గ్యాప్ ఇచ్చి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడ్డారట 'రంగస్థలం' చిత్ర బృందం. అసలు ముందుగా ఏప్రిల్‌కి వెళ్లిందని అనుకున్న 'రంగస్థలం 'చిత్రం తాజా సమాచారంతో మళ్లీ సంక్రాంతి రేసులోకి వచ్చింది అంటున్నారు.
అలాగే 'రంగస్థలం' షూటింగ్ అవుట్‌డోర్‌లో చేస్తుంటే జనాల వల్ల షూటింగ్ సాఫీగా జరగడంలేదని... భావించిన దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లోనే గోదావరి తీర ప్రాంత సెట్ వేసి మరీ షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు అని చెబుతున్నారు. మరోవైపు 'రంగస్థలం' హీరోయిన్ సమంత పెళ్లి హడావిడి కూడా మొదలు కానుండడంతో 'రంగస్థలం' ని ఇంకా ముందే కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారట. మొత్తానికి సంక్రాంతి బరి నుంచి మహేష్ తప్పుకుంటే గనక రామ్ చరణ్ తన సినిమాని కి బెర్ట్ కన్ఫర్మ్ చేసుకుంటాడు.