కత్తితో రకుల్!!

Update: 2017-07-21 10:00 GMT

మురుగదాస్, మహేష్ తో చేస్తున్న స్పైడర్ చిత్రం విడుదల చెయ్యడమే ఆలస్యం విజయ్ హీరోగా మరో మూవీ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో మురుగదాస్, విజయ్ లున్నారు. వీరి కాంబోలో వచ్చిన తుపాకీ, కత్తి చిత్రాలు సెన్సేషన్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు తెరకెక్కబోయే చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా సమంతని హీరోయిన్ గా తీసుకుందామని మురుగదాస్ అనుకున్నాడు.

కానీ సమంత ఇతర సినిమాల్తో బిజీగా ఉండడం, పెళ్లి పనులతో కూడా బిజీగా ఉండడంతో ఆమె ప్లేస్ లోకి విజయ్ కి జోడిగా రకుల్ ప్రీత్ ని తీసుకోవాలనే ఆలోచనలో మురుగదాస్ వున్నాడట. సమంత ఇంతకుముందే మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో సమంత నటనకు ఫిదా అయినా మురుగదాస్ మళ్ళీ సమంత నే తీసుకోవాలనుకున్నాడు. కానీ పై కారణాల వలన డ్రాప్ అయ్యారని తెలుస్తుంది.

ఏది ఏమైనా తమిళంలో కూడా పాగా వేసి అక్కడ కూడా టాప్ పొజిషన్ కి వెళ్లాలని చూస్తున్న రకుల్ కి ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ పక్కన నటించడం ప్లస్ అనే చెప్పాలి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మహేష్ తో కలిసి మురుగదాస్ డైరెక్షన్ లో ఆల్రెడీ స్పైడర్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు విజయ్ తో కూడా ఫైనల్ అయితే మళ్ళీ మురుగదాస్ డైరెక్షన్లోనే రకుల్ నటిస్తుందన్నమాట.

Similar News