సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కొత్తదనం కోసం అన్వేషిస్తూనే వుంటారు. అలా ఆయన కొద్దీ రోజులుగా తాను రూపొందిస్తున్న 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పై మంచి బజ్ నే ఏర్పరచుకున్నారు. ప్రముఖ పోర్న్ యాక్ట్రెస్ మియా మాల్కోవా తో నేకేడ్ సందేశాల్ని ఇప్పిస్తూ సెక్స్ రహస్యాలని, సృష్టి కోణాన్ని బహిర్గత పారస్తు సాగే ట్రైలర్ ని విడుదల చేసాడు వర్మ.
ఈ ట్రైలర్ చూసి ప్రముఖ సినీ విమర్శకుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
"మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేచ్ఛ స్వాంతంత్రాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో రామ్ గోపాల్ వర్మ అనే ఒక పురుషుడు విప్పిన ఒక గొంతుక 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'." అంటూ ట్వీట్ చేసిన కత్తి మహేష్ అమితమైన పరిశీలనా చాతుర్యానికి ఆశ్చర్యపోయి నిజంగా, మియా మాల్కోవా ట్రైలర్ లో చెప్పదలచినది తాను గ్రహించినందుకు ఆనందాశ్చర్యాలని వ్యక్తపరిచారు వర్మ.