'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో రానా కి జోడిగా కాజల్అగర్వాల్, కేథరిన్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, టీజర్ లలో కాజల్ అగర్వాల్ సంప్రదాయం ఉట్టిపడే మహిళగా చీరకట్టులో, కట్టు బొట్టులో అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో కనబడుతుంది. మంచి చీరకట్టులో యంగ్ లుక్ లో కాజల్ అదరగొట్టేస్తుంది. అలాగే ఒక మోడ్రెన్ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా లో కేథరిన్ పాత్రకు దగ్గరగావుంటుందని టక్కున చెప్పేలా కేథరిన్ పాత్ర వుంది. మినీ స్కర్ట్స్, పొట్టి నిక్కర్లు, దమ్ము కొడుతూ కేథరిన్ అచ్చం మోడ్రెన్ లుక్ లో పిచ్చెక్కిస్తుంది.
అయితే వీరిద్దరూ సినిమాలోనే కాదు బయట జరిగిన 'నేనే రాజు - నేనే మంత్రి జోగేంద్ర యువగర్జన'కు కూడా కాజల్ అగర్వాల్ చీరలో మెరవగా... కేథరిన్ మోడ్రెన్ గా మంచి డిజైనర్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. కాజల్ చీర కట్టులో అందంగా పెద్ద బొట్టు పెట్టుకుని ఆకర్షణీయంగా ఆకట్టుకుంది. ఇకకేథరీన్ కూడా సన్నని నడుంతో తన అందాలను ఆరబోస్తూ మోడరన్ గా దంచి కొట్టింది. ఇప్పటికే కేథరిన్ పలు సినిమాల్లో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుందనే విషయం తెలిసిందే.
ఇక ఒక్క హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి డ్రెస్సులతో అదరగొట్టడం లేదండోయ్ హీరోగా చేస్తున్న రానా కూడా జోగేంద్ర పంచె కట్టుతో సినిమాలో మాత్రమే కాదు నేనే రాజు - నేనే మంత్రి జోగేంద్ర యువగర్జన లో కూడా పంచె కట్టుతో ఇరగదీసాడు. సినిమాలో మాత్రమేనా బయట కూడా ఇలానే ఉంటా అంటూ రానా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నేనే రాజు - నేనే మంత్రి చిత్రం ఈ నెల 11 నే విడుదల కాబోతుంది.