కంగనా మణికర్ణిక లుక్ చూసారా?

Update: 2018-02-23 08:21 GMT

టాలీవుడ్ లో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రాన్ని అందించి బాలీవుడ్ లో వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్రని మణికర్ణికగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిస్తున్న డైరెక్టర్ క్రిష్... ఆ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా వున్నాడు. మణికర్ణిక సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజే కాశీలో పూజలు చేసి అందరి చూపు తిప్పుకున్న క్రిష్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మణికర్ణిక సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని జునాఘడ్ పోర్ట్‌లో స్పెషల్ గా వేసిన సెట్ లో శరవేగంగా జరుపుకుంటుంది.

మరి ఆ మధ్యలో మణికర్ణికగా కంగనా యువరాణిగా గుర్రమెక్కి యుద్ధం చేసిన కొన్ని ఫొటోస్ లీక్ అయ్యి నెట్ లో హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు మణికర్ణికగా కంగనా పూర్తిగా మారిపోయిన లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఝాన్సీ లక్ష్మి భాయ్ గా కంగనా ఆ లుక్ లో అదరగొట్టేస్తుంది. కంగనా ఈ మణికర్ణిక లుక్ తో సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాని మే కల్లా రెడీ చేసి విడుదల చెయ్యాలని మణికర్ణికా చిత్ర బృందం భావించినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగష్టు కి పోస్ట్ పోన్ అయ్యిందనే న్యూస్ ఉంది.

ఇకపోతే మణికర్ణిక సినిమాని కూడా దీపికా పదుకొనె తాజా చిత్రం పద్మావత్ లాగ సమస్యలు చుట్టే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే మణికర్ణిక సినిమాని చరిత్ర వక్రీకరించి తెరకెక్కిస్తే సహించబోమని ఝాన్సీ వంశస్తులు డైరెక్టర్ క్రిష్ కి హెచ్చరికలు పంపారు.

Similar News