ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి ప్రభంజనం

Update: 2018-01-09 11:20 GMT

మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న అజ్ఞాతవాసి ఫీవర్ మాములుగా లేదనే విషయం అందరికి తెలిసిందే. అజ్ఞాతవాసి టీజర్ , ట్రైలర్ లతో యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తున్న అజ్ఞాతవాసి ఇప్పుడు అమెరికాలో కూడా తన హవాను చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కు త్రివిక్రమ్ మ్యాజిక్ తోడైనందున ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికి కేవలం ప్రీ బుకింగ్ ద్వారానే 62.6వేల డాలర్ల వసూళ్లు సాధించేసింది. గడిచిన 24గంటల్లో అజ్ఞాతవాసి టిక్కెట్ల కోసం అమెరికా ప్రేక్షకులు విపరీతంగా వెతికారట.

అయితే అమెరికాలో సినిమా టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగించే ఒక వెబ్సైట్ లో హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ అజ్ఞాతవాసి మొదటి స్థానంలో ఉంది. దీన్నిబట్టే అర్ధమవుతుంది ఓవర్సీస్ లో అజ్ఞాతవాసికున్న క్రేజ్. మరి విడుదలకు ముందే ఈ లెవల్లో క్రేజ్ ఉండడంతో పాటే... రికార్డులు సృష్టిస్తుంటే అజ్ఞాతవాసి విడుదల తర్వాత మరిన్ని రికార్డులు కొల్లగొట్టేస్తుందో కదా అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

ఇక పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ అజ్ఞాతవాసి చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమాన్యూల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Similar News