సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గౌతమ్ నందా' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ నెల 28 న విడుదలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈ రోజు ఆదివారం 'గౌతమ్ నందా' ఆడియో వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే 'గౌతమ్ నందా' చిత్రం ఎప్పుడో జులై 14 నే విడుదల కావాల్సి ఉండగా... కొన్ని కారణాల వలన ఈ చిత్రం ఈ నెల 28 కి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ 28 కి ఇంకా కొన్ని సినిమాలు విడుదల ఉండడంతో 'గౌతమ్ నందా' టఫ్ కాంపిటేషన్ ఎదుర్కొనబోతుందని అంటున్నారు.
కృష్ణ వంశి 'నక్షత్రం' ఎప్పటినుండో విడుదలకు నోచుకోకుండా ఇప్పుడు సడన్ గా ఈనెల 28 న విడుదలకు సిద్ధమైపోయింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, రెజీనా, ప్రగ్య జైస్వాల్ లు నటిస్తుండగా.... ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్స్ గ్లామర్ షో. అందులోను కృష్ణవంశీకి ఏపీలోని కోస్తా జిల్లాల్లో మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగా ఉంటాయంటున్నారు. అలాగే ఈ చిత్రానికి పబ్లిసిటీని కూడా బాగా చేస్తుండంతో ఈ సినిమాపై కాస్త క్రేజ్ ఏర్పడింది.
మరి జులై 14 అయితే 'గౌతమ్ నందా' కి పెద్ద కాంపిటేషన్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు 28 న అనేసరికి కాస్త కాంపిటేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. అలాగే 'గౌతమ్ నందా' మీద ఉన్న నమ్మకంతో సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. అందుకే గోపిచంద్, సంపత్ నందిలు 'గౌతమ్ నందా' పబ్లిసిటీ మీద పెద్దగా ఫోకస్ చెయ్యట్లేదంటున్నారు.ఇక ఈ చిత్రంలో గోపీచంద్ పక్కన గ్లామర్ భామలు హన్సిక, కేథరిన్ థెరిస్సాలు నటించారు.