ఆగష్టు 22 న చిరంజీవి బర్త్ డే కానుకగా చిరు 151 మూవీ టైటిల్ లోగో 'సై రా నరసింహారెడ్డి' తోపాటు మోషన్ పోస్టర్ ని కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అలాగే మహామహులు ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తున్న విషయం మోషన్ పోస్టర్ లో రివీల్ చేసింది చిత్ర యూనిట్. మరి తొమ్మిదేళ్లు రాజకీయాల్లో తిరిగిన చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' అంటూ 150 వ చిత్రంతో రచ్చ రచ్చ చేసిన చిరు ఇప్పుడు తాజాగా 151 వ చిత్రాన్ని ఆఫీసియల్ గా సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు.
మరి చిరంజీవి సినిమా అంటేనే మెగా ఫాన్స్ ఊగిపోతారు. మరి మెగా ఫాన్స్ కి సినిమా టైటిల్ లాంచ్ రోజే మోషన్ పోస్టర్ ని కానుకగా ఇస్తే ఊరుకుంటారా. పండగ చేసేసుకోరు. ఇక చిరంజీవి 151 వ మూవీ లాంచ్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసి 'సై రా' చిత్రాన్ని జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చేలా ప్లాన్ చేసి ఈ మెగా ఈవెంట్ ని నిర్మాత రామ్ చరణ్ నిర్వహించి సక్సెస్ అయ్యాడు. మరి ఆ స్థాయిలో 'సై రా' కి క్రేజ్ తెచ్చారంటే.... మోషన్ పోస్టర్ కి ఇంకెంత క్రేజ్ వచ్చి ఉండాలి. మరి సినిమా మోషన్ పోస్టర్ తోనే చిరు మొదటిరోజే రికార్డుల వేట షురూ చేసాడు. చిరు 'సై రా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ విడుదలైన 24 గంటల్లోనే 1.27 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. మరి ఇన్ని వ్యూస్ ఒక మోషన్ పోస్టర్ కి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఒక్క చిరు కె అది సాధ్యమంటూ మెగా ఫ్యాన్స్ చంకలు గుద్దేసుకుంటున్నారు.
మరి సినిమా టైటిల్ ని ప్రకటించిన రోజే రికార్డులు స్టార్ట్ చేసిన ఈ చిత్రంలో జగపతిబాబు, అమితాబచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, హీరోయిన్ నయనతార వంటి మహామహులు నటిస్తుండగా... ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.అలాగే ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.