ఒక్క పాట కోసం భారీ వేడుక

Update: 2017-10-27 08:00 GMT

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 2.0 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని భారీగానే ఉన్నాయి. పబ్లిసిటీ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. రజినీకాంత్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్ గా అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుక ఈ రోజు శుక్రవారం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అంగరంగ వైభవంగా జరగనుంది. మరి కాసేపట్లో జరగబోతున్న 2.0 ఆడియో వేడుకలో కేవలం ఒక్క పాటనే విడుదల చేస్తుంది చిత్ర బృందం.

అసలు 2.0 లో కేవలం ఒక్క పాటే ఉండబోతోందనే విషయాన్నీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ బయటపెట్టాడు. అసలు మూడు పాటలు కంపోజ్ చేసినప్పటికీ సినిమాలో మాత్రం ఒక్క పాటే ఉంటుందని... మిగతా రెండు పాటలను తాను 2 0 ఆడియో వేదిక మీద లైవ్ పెరఫార్మెన్స్ ఇవ్వబోతుననట్లుగా చెప్పాడు. మరి దర్శకుడు శంకర్ ఈ ఒక్క పాట కోసమే దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టాడా? అలాగే ఈ ఒక్క పాట విడుదల కార్యక్రమాన్ని వేదికగా... దుబాయ్ ని ఎంచుకోవడం.. అలాగే ఈ వేడుకకి 12 కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటే మాత్రం ఈ సినిమా పబ్లిసిటీ ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. కానీ కేవలం ఒక్క పాట విడుదల కోసం ఈ లెవల్లో 12 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడు అంటే శంకర్ మామూలోడు కాదు.

అయినా శంకర్ అడిగినా నిర్మాతలు లైకా వారు ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా దాన్ని అమలు చెయ్యడం మాత్రం గొప్ప విషయమే కదా.

Similar News