"ఒక్క క్షణం" సినిమా చిక్కుల్లో పడింది

Update: 2017-12-18 09:00 GMT

గీత ఆర్ట్స్ కాంపౌండ్ నుండి ఈ నెలారికి విడుదల అవుతున్న చిత్రం ఒక్క క్షణం. పారలల్ లైఫ్ అన్న పాయింట్ ఆధారంగా ఈ థ్రిల్లర్ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ చాలా కొత్త మరియు ఇంటరెస్టింగ్ గా కనిపిస్తున్నాడు. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా విజయం తర్వాత ఆనంద్ అందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై ఓ సమస్య వచ్చి పడింది.

ఒక్కక్షణం సినిమా లైన్ ఓ కొరియన్ సినిమా నుంచి తెచ్చేసుకున్నది అనే టాక్ బయటికొచ్చింది. ఇలా కాపీ కొట్టడం మన టాలీవుడ్ కి అలవాటే ఇందులో ఏముంది అంటారా?? ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ కొరియన్ సినిమా రైట్స్ కొనేసి '2 - మేమిద్దరం' అనే చిన్న సినిమాగా కొత్తవాళ్లతో గప్ చుప్ గా నిర్మిస్తోంది.

ఒక్క క్షణం సినిమా విడుదల అయితే రైట్స్ కొనుకున్నది వేస్ట్ అవుతుందని ఛాంబర్ లో కంప్లైంట్ చేసింది ఈ సంస్థ. అక్కడితో ఆగకుండా దర్శకుడికి లాయర్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల పై కోర్ట్ నుండి స్టే తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు నిర్మాతలు రాజీకి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తే ఈ సినిమా అనుకున్న డేట్ కు రిలీజ్ అయ్యే అవకాశంవుంది. చూద్దాం ఫైనల్ గ ఏమవుతుందో..

Similar News