'శ్రీరస్తు శుభమస్తు' సినిమా సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు అల్లు శిరీష్.... 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' లాంటి సక్సెస్ సినిమా తీసిన వీఐ ఆనంద్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన సీరత్ కపూర్, సురభి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీకి 'ఒక్క క్షణం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన 'తగారు' సినిమా టీజర్ లాంచ్ కి వెళ్లిన శిరీష్ అక్కడ ఫాన్స్ తో మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో నడుస్తోంది. అల్లు శిరీష్, సీరత్ కపూర్, కమెడియన్ ప్రవీణ్ మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో అవసరాల శ్రీనివాస్ కనిపించనున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్క పోస్టర్ కానీ ప్రీ లుక్ కానీ చిత్ర బృందం నుండి బయటికి రాలేదు. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అని సమాచారం.