గతంలో సీనియర్ స్టార్స్ చాలామందే మల్టీస్టారర్ సినిమాల్లో కనబడటానికి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నటించేసేవారు. అసలు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్స్ చాలా సినిమా కలిసి నటించి మల్టీస్టారర్ సినిమాలకు అంటే ఇలా ఉండాలి అంటూ ట్రెండ్ సెట్ చేశారు. కానీ ఇప్పుడున్న హీరోలలో ఎవరూ పెద్దగా మల్టీస్టారర్ సినిమాలపై మోజు పడడంలేదు. అంటే.. స్టార్ హోదా ని ఎంజాయ్ చేస్తున్న హీరోలెవరు మరొక హీరోతో కలిసి సినిమా చెయ్యాలనే ఆలోచనే రానివ్వడంలేదు. ఎక్కడో ఒకటి అరా మాత్రం మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.. అందులోను టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు చాలా అరుదుగానే వస్తున్నాయి.
అయితే ఇప్పుడు రాజమౌళి సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పిక్ తోనే పూర్తిగా మల్టీస్టారర్ అర్ధాన్నే మార్చేసేలా కనబడుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తాను దిగిన ఫోటోని పోస్ట్ చేసి ఒక బడా మల్టీస్టారర్ సినిమాకి తెరలేపినట్లుగా క్లూ ఇచ్చి వదిలేసాడు. మరి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోల హోదాలో ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో చరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమా అంటే ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్, అంచనాలు ఉంటాయో ఊహాకే అందేలా కనబడడంలేదు.
మరి నిజంగానే ఈ మల్టీస్టారర్ సెట్స్ మీదకెళ్లింది అంటే.... టాలీవుడ్ లో స్టార్ హీరోలు మరిన్ని మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతారనడంలో సందేహమే లేదు. ఇకపోతే ఇప్పుడున్న రైటర్స్ స్టార్ హీరోల మీద మల్టీస్టారర్ కథలను రాయడానికి జంకుతున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ - ఎన్టీఆర్ సినిమాతో రైటర్స్ ఆ దిశగా కథలు సిద్ధం చెయ్యడానికి ఉత్సాహం చూపించి.... మరిన్ని కథలను ప్రిపేర్ చేస్తారు. మరి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో టాలీవుడ్ ఇండస్ట్రీని ఈ విధంగా షేక్ చేసేసిందన్నమాట.