ఒకరేంజ్ లో దివాళి సెలెబ్రేషన్స్!

Update: 2017-10-19 09:00 GMT

బాలీవుడ్ లో దీపావళి పండగొస్తుంది అంటే చాలు వారం ముందు నుండే ప్రి దివాళీ సెలెబ్రేషన్స్ అంటూ బాలీవుడ్ టాప్ సీలెబ్రిటీస్ అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక సెలెబ్రిటీ తమ ఇంట ప్రీ దివాళి బాష్ అనిపిలవడమే ఆలస్యం అందరూ ఎంచక్కా సింగారించుకుని అక్కడ వాలిపోతారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎప్పటినుండో ఉంది. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లోను ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ కింగ్ మెగాస్టార్ తన ఇంట ప్రీ దివాళి సెలెబ్రేషన్స్ ని అదిరిపోయే రేంజ్ లో చేసుకున్నాడు.

తన కుటుంబ సభ్యులతోపాటే 'సై రా.. నరసింహారెడ్డి' దర్శకుడు సురేందర్ రెడ్డి ఫ్యామిలీ, రామ చరణ్ 'రంగస్థలం' దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ, చరణ్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్, రామ్ చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్, అల్లు శిరీష్ అందరూ కలిసి చిరు ఇంట ఈ దివాళిసెలబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకున్నారు. ఆ దివాళి పార్టీలో అందరూ ఎలా ఎంజాయ్ చేశారో అనేది సోషల్ మీడియాలో లీకైన ఫొటోస్ తో తెలిసిపోతుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, చిన్న అల్లుడు కళ్యాణ్ అందరూ కలిసి ఈ వేడుకని కన్నుల పండుగా జరుపుకున్నారు.

ఇక ఈ పార్టీలో అందరూ ఆనందంగా ఉండడమే కాకూండా సెల్ఫీలతో హడావిడి చేశారు. చరణ్, ఉపాసన జంట అయితే ఈ దివాళి సెలెబ్రేషన్స్ కే హైలెట్ అయ్యారు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్, శ్రీజ కూతురు ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Similar News