ఏమైనా మార్చే అవకాశం ఉందంటారా..?

Update: 2017-07-12 10:15 GMT

ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాపై సర్వత్రా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపించడమూ ... ఎన్టీఆర్ జై గా విలనిజాన్ని పండించడానికి రెడీ అవడంపై అందరికి ఆసక్తి ఏర్పడి సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. ఇక జై లవ కుశ లోని జై టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించేపనిలో ఉంది. ఈ టీజర్ లో జై కేరెక్టర్ ఎంత క్రూయల్ గా ఉండబోతుందో డైరెక్టర్ బాబీ ప్రేక్షకులకి పరిచయం చేసాడు.

అయితే జై లవ కుశ కథ ప్రకారం జై విలన్ పాత్రని మిగతా లవ, కుశ క్లైమాక్స్ లో చంపెయ్యాల్సిన పరిస్థితి వస్తుందట. కమర్షియల్ గా జై కేరెక్టర్ ని చంపెయ్యాల్సి వస్తుందని... కానీ జై గా విలన్ పాత్ర చేస్తున్నది ఎన్టీఆర్ కావడం, లవ, కుశ పాత్రలు కూడా ఎన్టీఆర్ చెయ్యడంతో ఇక్కడో సమస్య వస్తుందని అంటున్నారు. అదేమిటంటే జై పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ని చంపేస్తే అభిమానులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎంత విలన్ అయినా ఆ పాత్రని పోషిస్తున్నది ఎన్టీఆర్ కాబట్టి ఆ పాత్రని చంపడం ఎంతవరకు కరెక్ట్? అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయట.

మరి జై పాత్రలోని ఎన్టీఆర్ ని చంపడమంటే కాస్త రిస్క్ కాబట్టి క్లైమాక్స్ ని ఎమన్నా చేంజ్ చేస్తారా? లేకపోతె క్లైమాక్స్ ని ఎమన్నా కొత్తగా ఆలోచిస్తారా? అనేది మాత్రం ఫుల్ సస్పెన్సు.

Similar News