ఏమిటా.. స్పీడు మహేశా

Update: 2017-08-13 15:30 GMT

మహేష్ బాబు - మురుగదాస్ కాంబో తెరకెక్కుతున్న 'స్పైడర్' ఒక పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మహేష్ ఒక పక్క 'స్పైడర్' సాంగ్ షూట్ లో పాల్గొంటూనే మరోపక్క కొరటాల షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతున్నాడు. కొరటాల శివ - మహేష్ హీరోగా 'భరత్ అను నేను' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల క్రితమే మొదలైంది. 'స్పైడర్' చిత్రం విడుదల కాకుండానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలెట్టిన మహేష్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని కూడా మొదలు పెట్టబోతున్నాడు. మహేష్ తన కెరీర్ లోనే ఇంపార్టెంట్ మూవీ అయినా 25 వ చిత్రాన్ని వంశి పైడిపల్లి డైరెక్షన్ లో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కథ కొత్తగా ఉండబోతుందని చెబుతున్న ఈ సినిమా రేపు అంటే సోమవారం కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా అధికారికంగా లాంచ్ చెయ్యబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారీ సినిమాల నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... అని అలాగే స్క్రిప్ట్ పట్ల కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని మహేష్ ఇదివరకే చెప్పాడు. ఇకపోతే ఈ చిత్రంలోని నటీనటులు, హీరోయిన్ విషయం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.

'బ్రహ్మ్మోత్సవం' వచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు ఒక్క మూవీని కూడా విడుదల చెయ్యని మహేష్ ఈసారి ఏకంగా ఒకేసారి రెండు మూవీలను లైన్ లో పెట్టి షాక్ ఇస్తున్నాడు. కొరటాల, వంశి పైడిపల్లితో చేసే మూవీస్ ఇంచుమించు వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే విడుదలకు సిద్దమవడం తధ్యంగా చెబుతున్నారు.

Similar News