ఏమి నీ అందాలు

Update: 2018-02-09 06:03 GMT

రకుల్ ప్రీత్ సింగ్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ షో తో రచ్చ రచ్చ చేస్తుంది. బాలీవుడ్ లో అమ్మడు నటించిన అయారి సినిమా విడుదలవుతుంది అనగానే రకుల్ ఇలా హాట్ షో కి తెరతీసింది. నిన్నగాక మొన్న మ్యాగ్జిమ్ కవర్ పేజీ కోసం బికినీ వేసి కాళ్ళ అందాల్ని చూపెడుతూ అదరగొట్టిన రకుల్ నిన్న అనేక రకాల హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ హడావిడి మొదలెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బాగా బిజీ అవడానికి ఇలాంటి గ్లామర్ షో స్టార్ట్ చేసిందని అందరూ దాదాపుగా ఫిక్స్ అయ్యారు.

టాలీవుడ్ లో అసలు అవకాశాలు లేక చేతులెత్తిసిన రకుల్ కి కోలీవుడ్ లో సూర్య సరసన ఒక సినిమా ఆఫర్ తగిలింది. కానీ బాలీవుడ్ లో పాపకి అడపా దడపా ఆఫర్స్ రావడంతో ఇక తగ్గేది లేదని ఇలా హాట్ హాట్ గ్లామర్ షోకి తెరలేపింది. మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం మ్యాగ్జిమమ్ విప్పేసింది. ఆ మ్యాగ్జిమ్ ఫోటో షూట్ లో భాగంగా రకుల్ చేసిన గ్లామర్ రచ్చ ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది. మరి ఎంతగా బికినీ, హాట్ షో చేసినా అమ్మడు నటించిన అయారి హిట్ అయితేనే మళ్ళీ బాలీవుడ్ లో ఉండేది. ఆ సినిమా ఫలితం అటు ఇటు అయ్యిందా అమ్మడు మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కోవాల్సిందే.

మరి అయారి సినిమా ప్రమోషన్స్ కోసం రకుల్ ప్రీత్ బాగానే కష్టపడింది. ఈ సినిమా విజయం మీదే రకుల్ ఆశలు, భవిష్యత్తు ఆధారపడినాయి. చూద్దాం రకుల్ ఫెట్ బాలీవుడ్ లో ఎలా వుండబోతుందో.. అనేది.

Similar News