ఏడ్చుకుంటూ వెళ్లినా ఫైన్ కట్టాల్సిందేనా..?

Update: 2017-07-27 06:16 GMT

ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా లో వస్తున్న బిగ్ బాస్ షో ఎన్టీఆర్ స్టేజి మీద ఉన్నంతసేపు మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. కానీ ఎన్టీఆర్ తప్పుకోగానే ఆ షో మీద ఎటువంటి క్రేజ్ రావడంలేదు. ఆ షోలో పార్టిసిపేట్స్ గా వచ్చిన వారు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలే తంటాలు పడుతున్నారు. అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్స్ చేసేందుకు వచ్చేటప్పుడు స్టార్ మా వాళ్ళకి భారీ లెవల్లో ముట్టజెప్పిందని... అందులోను అవకాశాలు లేక ఖాళీగా ఉండడంతో మారు మాట్లాడకుండా 70 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి వారు ఒప్పుకోవడం జరిగిపోయాయి. మరి బిగ్ బాస్ హౌస్ లో వారి పనులు వారే చేసుకోవడం, లేవగానే ఆ 14 మంది మొహాలు తప్ప బయట ప్రపంచంతో ఎటువంటి కాంటాక్ట్స్ లేకపోవడంతో ఆ పార్టిసిపేట్స్ కి నీరసాలు వచ్చేస్తున్నాయి. ఎటువంటి ఎనేర్జి పెరఫార్మెన్సు ఇవ్వలేక దిక్కులు చూస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టించేస్తున్నారు.

ఇక ఆ పార్టిసిపేట్స్ లో ఒకరు సంపూర్ణేష్ బాబు అయితే ఏకంగా తాను ఈ షోలో ఇక ఉండలేనని తనని పంపెయ్యమని వేడుకున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ మాత్రం తాను అలా ఎవరిని పంపలేనని ఖచ్చితంగా చెప్పడంతో సంపూర్ణేష్ బాబు బాగా హార్ట్ అయ్యి ఇంటికి వెళ్లి తన వాళ్ళని చూసుకోవాలనే ఉద్దశ్యంతో బిగ్ బాస్ పై రెచ్చిపోయి మాట్లాడి సూయిసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుని.... మరి ఆ హౌస్ నుండి బయట పడ్డాడు. కానీ సంపూ సూయిసైడ్ అట్టెంప్ట్ ని ప్రేక్షకులకు తెలియకుండా షో నిర్వాహకులు జాగ్రత్త పడినట్టు ప్రచారం జరుగుతుంది.

మరి పార్టిసిపేట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి వెల్ కమ్ చెప్పేటప్పుడు కళ్ళు చెదిరే ఆఫర్ తోపాటు కండిషన్స్ మీద కూడా సైన్ చేయించుకుంటారు సదరు నిర్వాహకులు. షో లో ఏదన్న సమస్యతో పార్టిసిపేట్స్ షో నుండి తప్పుకుంటే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారు. అందుకే షో నిర్వాహకులు అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక షోలో అడుగుపెట్టేటప్పుడు సంపూ కూడా ఇలా ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేసే వచ్చాడు. అయితే అన్ని కండిషన్స్ కి ఒప్పుకున్న సంపూ షోలో ఉండలేక ఎలిమినేషన్ ద్వారా బయటికి వెళ్ళిపోదామని స్కెచ్ వేసాడు. కానీ అది వర్కౌట్ అవ్వకపోయేసరికి కోపంతో ఊగిపోతూ ఏడుస్తూ బిగ్ బాస్ ని తిట్టి ఆయనే బయటికి వెళ్లమనేలా చేసుకుని వచ్చేసాడు.

ఇక బయటికి వచ్చేముందు బిగ్ బాస్ సంపూతో మీరు మీకై బయటికి వెళుతున్నారు అందుకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కుంటానికైనా సిద్హమేనా అని ప్రశ్నించగా ఏదొచ్చినా చూసుకుంటాననిమరీ ఏడుస్తూ బయటికి వచ్చేసాడు. మరి సంపూ అలా వచ్చేసాక షో నిర్వాహకులు అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నట్టు సంపూకి లీగల్ సమస్యలు రావచ్చని, అగ్రిమెంట్ ను ఉల్లంఘించినందుకు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందనే ప్రచారం మొదలైంది ఇక ఏడ్చినా బిగ్ బాస్ వేసే శిక్షని అనుభవించడానికి సంపూ రెడీ అవ్వాలన్నమాట..

Similar News