ఏంటి రాజీకొచ్చారా...?

Update: 2017-07-11 11:00 GMT

ఎన్టీఆర్ 'జై లవ కుశ' టీజర్ విడుదల చేసిన నెక్స్ట్ డే నుండి అది పూరి జగన్నాథ్ కథ నుండి కాపీ చేసారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరి రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ న్యూస్ పై ఇప్పటివరకు ఎన్టీఆర్ గాని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ గాని ఎక్కడా నోరు విప్పలేదు. కానీ న్యూస్ మాత్రం బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇక పూరి కథనే ఎన్టీఆర్ కాపీ కొట్టాడంటూ లీకైన న్యూస్ వెనుక పూరి ఫ్రెండ్ ఛార్మి ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ సమస్య ముగిసిపోయినట్లు... తెర వెనుక ఎన్టీఆర్, పూరి రాజీకొచ్చినట్టు తెలుస్తుంది. వరుస హిట్స్ తో కాస్త ఇప్పుడిప్పుడే లైన్ లో పడ్డ ఎన్టీఆర్ కి 'జై లవ కుశ' పై ఎటువంటి నెగెటివ్ టాక్ రావడం ఇష్టం లేక పూరితో ఎన్టీఆర్ కలిసి కూర్చొని ఈ కాపీ మేటర్ సెటిల్ చేసినట్టు చెబుతున్నారు. ఇక సెటిల్మెంట్ లో పూరితోఒక సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ కమిట్ అయ్యాడని అంటున్నారు. మరోపక్క పూరి కూడా ఈ విషయంలో రచ్చ చెయ్యడం ఇష్టం లేనట్లుంది.

అందుకే ఎన్టీఆర్ కి ఈ విషయమై ఎక్కడా బయట మాట్లాడానని మాటిచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ మేటర్ ఇంతటితో సద్దుమణిగితే బాగానే ఉంటుంది. ఇకపోతే ఎన్టీఆర్ - పూరి కాంబోలో వచ్చిన 'టెంపర్' ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇక ఈ సెటిల్మెంట్ వ్యవహారం చూస్తుంటే త్వరలోనే ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందన్నమాట.

Similar News