ఏంటి ఆ హీరో అలా చేశాడా..?

Update: 2017-07-18 03:37 GMT

సినిమా స్టార్ట్ అవ్వగానే టైటిల్స్ పడకముందే మందు, సిగరెట్ ఆరోగ్యానికి హానికరమంటూ వేస్తారు. కానీ సినిమాలో వాటిని చూపిస్తూనే కింద మళ్ళీ అదే పదాల్ని వాడుతుంటారు. కానీ సినిమాల్లో నటించే చాలామందికి మందు, సిగరెట్ అలవాట్లు ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా డ్రగ్గిస్టులు కూడా వున్నారంటున్నారు. అయితే నాని సినిమా మజ్నులోనే మందు ఆరోగ్యానికి హానికరం.... కానీ సినిమా కోసం తప్పడంలేదంటూ నాని వాయిస్ ఓవర్ వినిపిస్తాడు. ఇక ఇప్పుడు వివాదాలకు కాస్త దూరంగా ఉండే నాని ఒకసారి షూటింగ్ కి మందు కొట్టి వెళ్ళాడట. ఆ మత్తులోనే నాని షూటింగ్ లో పాల్గొన్నాడట.

అయితే ఇదంతా నాని మీద ఎవరో గిట్టనివాళ్ళు ప్రచారం చేసింది కాదు. నిన్నుకోరి డైలాగ్ రైటర్ కోన వెంకట్ స్వయంగా నాని షూటింగ్ కి మందు కొట్టి వచ్చాడని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే నాని మందు కొట్టింది మాత్రం కేవలం ఆ సినిమాలో ఒక సీన్ ని పండించడానికే అంట. నిన్నుకోరి సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతున్నప్పుడు ఓ ప్రదేశంలో 0 డిగ్రీల టెంపరేచ్ ఉండగా నాని ఆ సీన్ కోసం ఫుల్ బాటిల్ తాగేసి వచ్చి మరీ ఆ సీన్ పండించాడని చెబుతున్నాడు.

నిన్నుకోరి సినిమాలో ఆ సీన్ అంత బ్యూటిఫుల్ గా,న్యాచరుల్ గా రావడానికి.. నిజంగా నాని ఫుల్ బాటిల్ కొట్టడమే కారణమంటూ కోన వెంకట్ చెబుతున్నాడు. అందుకే నిజంగా నాని న్యాచురల్ స్టార్ అని ఆకాశానికెత్తేస్తున్నాడు కోన వెంకట్.

Similar News