'సాహో' చిత్రంలో ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ కోసం ఎంతమందినో చూసి చూసి ఆఖరుకి బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ ని ఫైనల్ చేశారు. ముందు నుండి బాలీవుడ్ భామలమీదే కన్నేసిన 'సాహో' చిత్ర యూనిట్ ముందుగా ప్రభాస్ కి జోడిగా కత్రినా కైఫ్ అలాగే అలియా బట్, టాలీవుడ్ సుందరి అనుష్క ఇలా ఎంతమంది పేర్లో చర్చకు వచ్చాయి. ఆఖరుకి 'సాహో' చిత్ర యూనిట్ అనుకున్నదే చేసింది. 'సాహో' కోసం బాలీవుడ్ భామనే రంగంలోకి దించింది. ఫైనల్గా శ్రద్ద కపూర్ ని తీసుకుంది. ఇక ఈ భామకి అత్యధికంగా 8 కోట్ల పారితోషకాన్ని కూడా అందిస్తున్నారు.
అయితే ఇప్పుడు సాహోలో ప్రభాస్ పక్కన శ్రద్ద కపూర్ ఏ మాత్రం మ్యాచ్ అవదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు. ప్రభాస్ పక్కన శ్రద్ద కపూర్ ఇలా పేరు వింటేనే ఏదోలా ఫీల్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. అలాగే ప్రభాస్ ఏమో చాలా హైట్. ఆరడుగుల హైట్ ఉండే ప్రభాస్ పక్కన కొంచెం పొట్టిగా, సన్నగా వుండే శ్రద్ద కపూర్ ఏం బావుంటుందంటున్నారు. అసలు అనుష్క అయితే ప్రభాస్ కి బాగా సూట్ అయ్యేదని... కాకపోయినా కాజల్ లాంటి వాళ్ళు కూడా ప్రభాస్ పక్కన ఆనతారు గాని మరి బొత్తిగా శ్రద్ద కపూర్, ప్రభాస్ పక్కన తేలిపోతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
అలాగే అందం విషయంలోనూ శ్రద్ద ఏమంత అందగత్తె కూడా కాదని... ఆమెకు బాలీవుడ్ లో ఏమంత పేరు కూడా లేదని... ఇలాంటప్పుడు 'సాహో' కోసం శ్రద్దని తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. కానీ 'సాహో' చిత్ర యూనిట్ మాత్రం మూడు భాషల్లో సినిమా విడుదల చేస్తున్నాం కాబట్టి..... హిందీ మార్కెట్ నే ఎక్కువుగా దృష్టిలో పెట్టుకోవడం మూలంగానే 'సాహో' కోసం శ్రద్దని తీసుకున్నామని సరిపెట్టేస్తున్నారు. మరోపక్క 'సాహో' లో శ్రద్ద కపూర్, ప్రభాస్ పక్కన ఎలా వుండబోతుందో చూడాలంటె ఏ టీజరో, ట్రైలేరో వచ్చేవరకు వైట్ చెయ్యాల్సిందే అంటున్నారు.