రాజ్ తరుణ్ డీజే డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఊహాగానాలు ఆ మధ్యన సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా హరీష్ శంకర్ ఏవో లొకేషన్స్ వేటలో ఉన్నట్టు ఒక ట్వీటేసి మరీ బిల్డప్ ఇచ్చాడు. ఇక హరీష్ ట్వీట్ చూసిన వారంతా దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్, రాజ్ తరుణ్ తో సినిమా చెయ్యబోతున్నాడంటూ గాసిప్స్ పుట్టించేసారు.
అయితే అప్పట్లోనే ఆ గాసిప్ ని హీరో రాజ్ తరుణ్ ఖండించినట్లు వార్తలొచ్చాయి కానీ... ఇప్పుడు రాజ్ తరుణ్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చిందంటున్నారు. రాజ్ తరుణ్ , హరీష్ శంకర్ తో ఎటువంటి సినిమా కమిట్ అవ్వలేదని.....రాజ్ తరుణ్ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నమాట. కాకపోతే దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ ఒక సినిమాకి కమిట్మెంట్ ఉన్న మాట నిజమే.. కానీ ఆ సినిమా హరీష్ డైరెక్షన్ చెయ్యడట.ఇక ఇదే విషయాన్ని రాజ్ తరుణ్ సన్నిహిత వర్గాలు ఖండించడమే కాదు.... 'హరీష్ తో రాజ్ తరుణా? వాటే జోక్' అంటున్నారు.
అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడట. ఇకపోతే దిల్ రాజు సినిమాకు కథతో పాటే డైరక్టర్ ను కూడా ఫిక్స్ చేసుకోవాలట. కానీ హరీష్ శంకర్ కి మాత్రం రాజ్ తరుణ్ అవకాశం ఇవ్వడనే మాట మాత్రం గట్టిగా వినబడుతుంది.